DK Shivakumar: గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ మనుగడ అసాధ్యం అని ఆ పార్టీ కర్ణాటక యూనిట్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. గాంధీ కుటుంబంతోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందనీ, కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు వారే కీలకమని అన్నారు. అధికారం కోసం ఆరాటపడే వారు దయచేసి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడనీ, ఇప్పటికే చాలా మంది నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడరని తెలిపారు.
DK Shivakumar: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ముఠా కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సరైనా.. పోటీనివ్వలేదు కాదా.. అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజార్చుకుంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఖాతం.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నాయకత్వం మరోసారి చర్చ జరుగుతోంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిగ్భ్రాంతికర ఫలితాలు వచ్చాయి. పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ లోని అసమ్మతి కోరుకుంటే.. గాంధీ కుటుంబ నాయకత్వం సమర్థించే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ప్రజలను మెప్పించేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో కాంగ్రెస్ ముందు ఓ అవకాశం నిలిచిందని, అందులో తమ నేతలు విఫలం అయ్యారని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా పనితీరును డీకే శివకుమార్ సమర్థించారు. గాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ కుటుంబం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్‌కు మనుగడే ఉండదని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో డీకే శివకుమార్ ఓ జాతీయ ఛానెల్‌లో మాట్లాడారు.
గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ ఐక్యంగా ఉండదని పార్టీ అగ్రనేత డికె శివకుమార్ గురువారం అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన తర్వాత నాయకత్వాన్ని సమర్థిస్తూ .. ఇతర నాయకులపై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఆరాటపడే నేతలు దయచేసి కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి వెళ్లండని అన్నారు. ఇప్పటికే వ్యక్తిగత ప్రయోజనాలను చూసే వ్యక్తులు కాంగ్రెస్‌ను విడిచిపెడుతున్నారనీ, మిగిలిన వారికి అధికారంపై ఆసక్తి లేదనీ.. తాము కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సిద్ధాంతాలకు విధేయులం, గాంధీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.
గాంధీ కుటుంబ సభ్యుల నాయకత్వాన్ని బలపరుస్తూ.. డికె శివకుమార్ ఇలా మాట్లాడారు. యూపీలోప్రియాంక గాంధీ చాలా శ్రమటోర్చారని, అయినా ఫలితాలను రాబట్టలేకపోయామన్నారు. ప్రజలను మెప్పించడంలో కాంగ్రెస్ నేతలంతా విఫలమయ్యామని అన్నారు. ప్రజలను మెప్పించడానికి తమకు ఓ అవకాశం వచ్చిందని, ఇందులో తాము విఫలమయ్యామని డీకే పేర్కొన్నారు.
గురువారం ప్రకటించిన పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్‌ను కోల్పోయింది. మరో మూడు రాష్ట్రాల్లో బలమైన పోరాటం చేయడంలో విఫలమైంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించినప్పటీకి .. ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె. సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ప్రచారం జరిగిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరా పరాజయం పాలైంది. 403 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
ఈ ఓటమితో పార్టీలోనూ, బయటా కూడా నాయకత్వంపై అసమ్మతి బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ గురువారం మాట్లాడుతూ..పార్టీలో వ్యవస్థీకృత మార్పులు, లీడర్‌షిప్‌లో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తు చేశాయని తెలిపారు. దేశ ప్రజల్లో కాంగ్రెస్ ఐడియాలజీని మళ్లి పునరుద్ధరించేలా వ్యవస్థీకృత నాయకత్వంలో మార్పులు తప్పవన్నారు. గెలవాలంటే.. మార్పు తప్పదని స్పష్టం చేశారు.
