కాంగ్రెస్ కు మంగళవారం రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్ లో ఆ పార్టీకి అధోగతి పడుతుందని అన్నారు.
పంజాబ్ (punjab) ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ (Ashwani Kumar) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి భవష్యత్ లో అధోగతి పడుతోందని అన్నారు. దేశ మానసిక స్థితిని ప్రతిబింబించేలా కాంగ్రెస్ పార్టీ కనిపించడం లేదని తెలిపారు. ఆ పార్టీని ప్రొజెక్ట్ చేసే నాయకుడు కూడా ప్రజలకు ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ (rahul gandhi)ని ఉద్దేశించి ఆయన అన్నారు.
‘‘ప్రధానమంత్రి విషయంలో ప్రజలు సంతోషంగా లేకపోతే వాళ్లు కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు వేయలేదు? మనం అందిస్తున్న ప్రత్యామ్నాయం ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. అందుకే మనకు ఓట్లు రాలేదు. దీనిపై పార్టీలో చర్చ జరగాలి’’ అని అశ్వనీ కుమార్ చెప్పారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా అశ్వనీ కుమార్ పనిచేశారు. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపించారు. బీజేపీ (bjp)లో చేరుతారా అనే ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. ‘‘ నేను దాని గురించి ఇప్పుడు ఆలోచించలేదు. నేను బీజేపీలో ఎవరినీ కలవలేదు. ఇంకా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో కూడా చేరలేను ’’ అని అశ్వనీ కుమార్ తెలిపారు.
గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ను వీడిన అత్యంత సీనియర్ నాయకులలో అశ్వనీ కుమార్ ఒకరు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌కు సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉంది. అయితే తన రాజీనామా విషయంలో ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. ఈ ఆదివారం ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఆయనను తప్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ (rahul), ప్రియాంక గాంధీ (priyanka gandhi) కాకుండా మన్మోహన్ సింగ్ (manmohan singh) కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ కదా ? అని ప్రశ్నించాడు. పంజాబ్ కాంగ్రెస్ గొడవలో పార్టీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరును అశ్వనీ కుమార్ తుంగలో తొక్కారు. పంజాబ్‌లో ఇలాంటి నాయకత్వం ఎప్పుడూ లేదు. ఇది గడిచిన 40 ఏళ్లలో అత్యంత చెత్తగా ఉంది అని వ్యాఖ్యానించారు.
"అమరీందర్ సింగ్ (amarinder singh)ను అవమానించి రాజీనామా చేసేలా వ్యవహరించిన తీరు పట్ల పంజాబ్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పై ఉన్న మంచి అభిప్రాయాన్ని పోయేలా చేసింది. నేను అమరీందర్ సింగ్ అంతరంగిక వర్గంలో ఎప్పుడూ లేను. కానీ అతను అవమానానికి గురైన తీరుపై నేను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. దానిని పూర్తిగా ఖండిస్తున్నాను.’’ అని ఆయన తెలిపారు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ లో ఉండి.. ఎన్నికల సమయంలో పార్టీని వీడాలనే తన నిర్ణయాన్నిఅశ్వనీ కుమార్ వివరించారు. ‘‘ నేను చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. నా జీవితంలో ఈ దశలోనైనా, నేను నా స్వంత అంచనాలో ఎదగకూడదా ? నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తే నేను ఇక్కడ దేనికి కట్టుబడి ఉన్నాను? అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను ’’ అని ఆయన తెలిపారు.
