Congress Tiranga Row: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ త్రివర్ణ చిత్రాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ షేర్ చేయడంతో బీజేపీ మండిపడింది.
Congress Tiranga Row: భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అలాగే.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను మర్చారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ గా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ జెండాను పట్టుకొని ఉన్న చిత్రాన్ని పెట్టుకున్నారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం. అది ప్రతి పౌరుడి హృదయంలో ఉందని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్నిపట్టుకున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ క్రమంలో బిజెపి నాయకుడు మనోజ్ తివారీ వారిపై కామెంట్ చేశారు. త్రివర్ణ పతాకంలో కూడా విపక్షాలు బీజేపీని చూస్తున్నారని ఏద్దేవా చేశారు. నెహ్రూ జీ త్రివర్ణ పతాకాన్నిపట్టుకుంటే.. ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టుకున్నారనీ రాశారని అన్నారు. మనోజ్ తివారీ ఇంకా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి హీరో అయ్యే అవకాశం ఈరోజు వచ్చిందని, దానిని ఆయన కోల్పోయారని అన్నారు.
ఈ ఏడాదితో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఆగస్టు 2 నుంచి 15 మధ్య తన సోషల్ మీడియా ఖాతా యొక్క డిపిలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిఎం మోడీ మునుపటి మన్ కీ బాత్ ప్రజలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హర్-ఘర్ తిరంగా అనే ప్రచారం కూడా జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బుధవారం కూడా త్రివర్ణ పతాకాల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన సామాజిక ఖాతాలో తన ప్రొఫైల్ పిక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఉంచడంతో కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంది. కానీ, DPలో త్రివర్ణ పతాకంతో ఉన్న మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రాన్ని ఉంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో త్రివర్ణ పతాకం మన హృదయాల్లో ఉంది, అది రక్తంలా మా నరాల్లో ప్రవహిస్తుంది. 1929 డిసెంబరు 31న పండిట్ నెహ్రూ రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిశారని రాసుకోచ్చారు.
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్.. RSS, దాని సర్సంఘచాలక్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఇలా వ్రాశారు, మేము మా నాయకుడు నెహ్రూ DP ని చేతిలో త్రివర్ణ పతాకంతో ఉంచుతున్నాము, కాని ప్రధానమంత్రి సందేశం అతని కుటుంబానికి చేరుకోలేదని తెలుస్తోంది. 52 ఏళ్లుగా నాగ్‌పూర్‌లోని RSS హెడ్ క్వార్టర్స్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని వారు ప్రధానమంత్రికి కట్టుబడి ఉంటారా?" అని ప్రశ్నించారు. "సంఘ్ ప్రజలు ఇప్పుడే త్రివర్ణ పతాకాన్ని స్వీకరించారు" అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు
మరోవైపు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని నిర్వహించడానికి దేశం సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియా DP (డిస్ప్లే పిక్చర్)ని మార్చాను. మీరందరూ కూడా అలాగే చేయాలని కోరుతున్నానని అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో.. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ఎర్రకోట నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో పలువురు ఎంపీలు ఇవాళ ఢిల్లీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బైక్ పై వెళ్లారు.
ఈ సందర్బంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాం, వారిని స్మరించుకుంటున్నాం' అనే సందేశాన్ని అందించేందుకు, ఈ ఆజాదీలో భరోసా ఇచ్చేందుకు వివిధ కేంద్ర మంత్రులు, ఎంపీలు, యువనేతలు తరలివచ్చి చారిత్రక ఎర్రకోట నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించారు. కా అమృత్ మహోత్సవ్, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి, భారతదేశ కీర్తిని పెంచడానికి కృషి చేస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
