కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ గాయపడ్డారు. మలయాళీల నూతన సంవత్సరాది విషు పండుగను పురస్కరించుకుని తంపనూర్ ప్రాంతంలోని గాంధారి అమ్మన్ కోవిళ్ ఆలయంలో శశిథరూర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ గాయపడ్డారు. మలయాళీల నూతన సంవత్సరాది విషు పండుగను పురస్కరించుకుని తంపనూర్ ప్రాంతంలోని గాంధారి అమ్మన్ కోవిళ్ ఆలయంలో శశిథరూర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయంలో తులాభారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన కూర్చొన్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో శశిథరూర్ కాలికి, తలకు గాయమైంది. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

థరూర్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో వైద్యులు ఆయనకు ఆరు కుట్లు వేశారు. ప్రస్తుతం థరూర్ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు.

Scroll to load tweet…