నిర్బయ కేసు Vs మణిపూర్ హింస.. నిరసనలపై ఫొటో.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అంటూ సెటైర్లు..
కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సెల్ప్ గోల్ అంటూ మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా మణిపూర్ అంశంపై తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి I.N.D.I.A డిమాండ్ చేస్తోంది. అయితే ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సెల్ప్ గోల్ అంటూ మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు.. 2012లో నిర్బయ ఘటన తర్వాత ఢిల్లీ వీధుల్లోకి పెద్దఎత్తున తరలివచ్చిన వచ్చి నిరసన తెలిపారని, 2023లో మణిపూర్‌లో మహిళల నగ్నంగా ఊరేగించిన ఘట వీడియో తర్వాత ఢిల్లీ వీధుల నిర్మానుష్యంగా ఉన్నాయని పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం ట్విట్టర్‌లో ఓ ఫొటో పోస్టు చేసింది. అంతేకాకుండా ‘‘అప్పుడు.. ఇప్పుడు’’ అనే క్యాప్షన్‌ను కూడా జత చేసింది.
అయితే ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న మెజారిటీ నెటిజన్లు కాంగ్రెస్ సెల్ప్ గోల్ చేసుకుందని.. వారి ప్రభుత్వంలో శాంతిభద్రతలపై నమ్మకం లేకనే నిర్భయ ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు ఢిల్లీ వీధుల్లోకి తరలివచ్చారని పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఇళ్లలో కూర్చున్నారని కాంగ్రెస్ అంగీకరించిందని.. వారి నిజాయితీ బాగుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
స్వరాజ్య మీడియా సంస్థ సీనియర్ ఎడిటర్ తుషార్ గుప్తా స్పందిస్తూ.. ‘‘సమస్యను పరిష్కరించేందుకు బీజేపీని నమ్మి ప్రజలు ఇళ్లలో కూర్చున్నారని కాంగ్రెస్ అంగీకరించింది. నిజాయితీ బాగుంది’’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘‘అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సక్రమంగా వ్యవహరిస్తోందని అర్థం. ప్రజలు విశ్వసిస్తారు. కనుక ఎలాంటి బాధలేదు’’ అని పేర్కొన్నారు.
‘‘ఎందుకంటే 2012లో ప్రజలు పప్పెట్, సైలెంట్ ప్రధానిపై ఆశలు పెట్టుకోలేదు. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ఏదైనా చేస్తారని భారతీయులకు ఇప్పుడు ఆశ ఉంది. థగ్స్ vs ట్రస్ట్’’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.