Asianet News TeluguAsianet News Telugu

Manipur Violence: " ప్రధాని మోడీ తప్పించుకోలేరు.. ఆ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే .."

Manipur Violence: మణిపూర్ సంక్షోభం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. గత ఆరు నెలలుగా ఆ రాష్ట్రంలో సంక్షోభం చెలారేగుతోన్న ప్రధాని మోదీ మాత్రం ఇప్పటికీ మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ తరుణంలో ప్రధాని మోడీని ఐదు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలేంటీ?

Congress says PM Modi cannot escape accountability by completely ignoring Manipur crisis KRJ
Author
First Published Oct 24, 2023, 11:50 PM IST | Last Updated Oct 24, 2023, 11:49 PM IST

Manipur Violence: హింసాత్మకమైన మణిపూర్‌లో  ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దాడి చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో సంక్షోభం నెలకొంటే.. ప్రధాని మోడీ మాట్లాడకపోవడం విమర్శలకు దారితీసింది. కనీసం ఆ సంక్షోభానికి నిలిపివేయడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మణిపూర్ సంక్షోభంపై మాట్లాడమంటే.. అది మన దేశంలో భూభాగమని, తాను గతంలో చాలాసార్లు ఈశాన్య ప్రాంతాల్ని సందర్శించానని మోదీ చెప్పడం మరింత దురదృష్టకరమని విమర్శలు గుప్పిస్తోంది.

ఈ అంశంపై  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. మే 3వ తేదీన  ఈశాన్య రాష్ట్ర మణిపూర్ లో సంక్షోభం చేలారేగింది. ఇప్పటికీ ఆ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. నేటితో 175 రోజులు పూర్తయినా..ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించడం ద్వారా ప్రధాని మోదీ జవాబుదారీతనం, బాధ్యత నుంచి తప్పించుకోలేరని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ అన్నారు.  రాష్ట్రంలో సయోధ్య, విశ్వాసాన్ని పెంపొందించే ప్రక్రియ ఊపందుకోవాలని కోరుకునే ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జై రాం రమేశ్.. ప్రధాని మోడీకి ఈ ఐదు ప్రశ్నలు అడగాలని పిలుపునిచ్చారు

ఆ 5 ప్రశ్నలు ఏమిటి?

1.  ఇప్పటి వరకూ మణిపూర్‌ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను ప్రధాని ఎందుకు కలవలేదు? వీరిలో ఎక్కువ మంది నాయకులు సొంత పార్టీకి చెందిన వారు లేదా ఆయన పార్టీ మిత్రపక్షాల వారే కదా!
 
2. మణిపూర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి ప్రధానిని ఎందుకు కలవలేదు ?

3. అన్ని విషయాలపై బోధించే ప్రధాని మోడీ.. ప్రతిపక్షాలు విమర్శిస్తే తప్ప మణిపూర్‌పై బహిరంగంగా 4-5 నిమిషాలకు మించి ఎందుకు మాట్లాడలేదు ?  

4. ప్రయాణం చేయడమంటే ఇష్టపడే ప్రధాని మోడీ.. మణిపూర్‌లో కొన్ని గంటలు గడిపి ఆందోళనలు సద్దుమణిగేలా ఎందుకు చేయడం లేదు ?  

5. మణిపూర్‌లోని అన్ని వర్గాల ప్రజలచే తిరస్కరించబడిన ముఖ్యమంత్రిని ఇంకా పదవిలో కొనసాగడానికి ఎందుకు అనుమతిస్తున్నారు ?  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios