రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న సంక్షోభం ముగిసింది. సచిన్ పైలెట్ తిరిగి పార్టీలో చేరేందుకు అంగీకరించారు. సచిన్ పైలెట్ సోమవారం నాడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో సమావేశమయ్యారు.
జైపూర్: రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న సంక్షోభం ముగిసింది. సచిన్ పైలెట్ తిరిగి పార్టీలో చేరేందుకు అంగీకరించారు. సచిన్ పైలెట్ సోమవారం నాడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత సచిన్ పైలెట్ తిరిగి పార్టీలో చేరేందుకు అంగీకరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ ఏడాది జూలై 12వ తేదీన సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. దీంతో జూలై 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్ ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి నుండి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మరో వైపు సచిన్ తో పాటు ఆయన వెంట ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్టానం పూనుకొంది.
also read:గెహ్లాట్‌కి సచిన్ మద్దతు: ఖండించిన పైలెట్ వర్గం
ఈ నెల 14వ తేదీ నుండి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో బలాన్ని నిరూపించుకోవాలని ఆశోక్ గెహ్లాట్ ప్లాన్ చేస్తున్నారు.ఈ తరుణంలో సచిన్ పైలెట్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగిపోయాయి.
సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.సచిన్ పైలెట్ లేవనేత్తిన అంశాలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటిని సోనియా గాంధీని ఏర్పాటు చేశారని వేణుగోపాల్ ప్రకటించారు.
సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉండబోవని కూడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులతో పాటు నామినేటేడ్ పదవులు ఇవ్వనుంది.
సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే భన్వర్ లాల్ గెహ్లాట్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సచిన్ పైలెట్ తన గురించి ఎప్పుడూ మాట్లాడుతాడని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారమైనట్టుగా ఆయన చెప్పారు.పైలెట్ వర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
