ఆ ప్రతిపాదనతో రాజ్యాంగం, ఫెడరలిజంపై దాడి చేయడమే: కాంగ్రెస్
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఆమోదించే సంఖ్య బీజేపీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. దేశ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే ప్రతిపాదనను కాంగ్రెస్ శనివారం తిరస్కరించింది. ఈ చర్య రాజ్యాంగం, ఫెడరలిజంపై దాడి అని పేర్కొన్నారు.

ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఆమోదించే సంఖ్య బీజేపీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. దేశ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే ప్రతిపాదనను కాంగ్రెస్ శనివారం తిరస్కరించింది. ఈ చర్య రాజ్యాంగం, ఫెడరలిజంపై దాడి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) మొదటి సమావేశం చర్చలపై పార్టీ నాయకుడు పి చిదంబరం ప్రసంగిస్తూ.. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఆమోదించే సంఖ్య బిజెపికి లేదని అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది రాజ్యాంగంపై దాడి.. ఫెడరలిజంపై దాడి అని ఆయన అన్నారు. దీనికి కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని, వీటిని ఆమోదించే సంఖ్య బీజేపీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే ఎండమావిని ముందుకు తీసుకవచ్చి.. దేశ ఎదుర్కొంటున్న సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి, తప్పుడు కథనాన్ని సృష్టించడానికి ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను తాము తిరస్కరించామని చిదంబరం అన్నారు.
మణిపూర్‌లో అశాంతి నెలకొందని, కానీ.. మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీకి సమయం దొరకడం లేదని చిదంబరం విమర్శించారు. కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది? దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయనీ, జమ్మూకశ్మీర్‌లోని మణిపూర్‌లో భద్రతాపరమైన సవాళ్లు ఉన్నాయన్నారు. అంతర్గత భద్రతతో పాటు మన సరిహద్దుల్లో చైనా సమస్యగా మారిందని కాంగ్రెస్ నేత అన్నారు.వివిధ స్థాయిలలో అనేక చర్చలు జరిగినప్పటికీ.. చైనా తీరులో మార్పు రావడం లేదని అన్నారు. చైనీయులు మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని మోదీ వాదిస్తున్నారని మండి పడ్డారు.
నిరంతరం పెరుగుతున్న వడ్డీ రేట్లు
ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతున్నారని ఆయన అన్నారు. దీంతో మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. అనేక వస్తువులపై రిటైల్ ద్రవ్యోల్బణం రెండంకెల దగ్గర లేదా అంతకు మించి చేరుకుందని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం 10% మించిపోయిందని విమర్శించారు. కానీ, ప్రభుత్వం వద్ద వివరణ లేదని అన్నారు. టోకు ధరల సూచీ పడిపోతున్నాయనీ, రిటైల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగం దాదాపు 8.5% కి చేరిందనీ, అలాగే.. నెలవారీ ఎగుమతులు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అనేక సూచీలు తీవ్ర సంక్షోభం వైపు గురిపెట్టాయని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మందగమన వృద్ధి, పడిపోతున్న ఎగుమతులు, పెరుగుతున్న దిగుమతులు మన దేశ ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తారు. హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మరియు మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కె సింగ్ సభ్యులుగా ఉంటారు. చౌదరి తరువాత ప్యానెల్‌లో భాగం కావడానికి నిరాకరించారు.