దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. కేంద్రంలో తిరిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కేంద్రంతోపాటు.. రాష్ట్రాల్లోనూ తమదే పై చేయిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీలు పరితపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతు రుణమాఫీ తోపాటు రైతుల విద్యుత్ బిల్లులను సైతం 50శాతానికి తగ్గిస్తామని చెప్పారు. కుటుంబంలో నిరుద్యోగి ఉంటే రూ.10వేలు ఇస్తామన్నారు. ఆడపిల్లల పెళ్లికి రూ.51వేలు ఇస్తామని కూడా తెలిపారు. ఈ మేనిఫెస్టోని కాంగ్రెస్  మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులు విడుదల చేశారు.

మధ్యప్రదేశ్ లో ఎన్నికలు ఈ నెల 28న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.