JammuKashmir: జ‌మ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ ఆందోళ‌న‌లకు దిగింది. ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌తో బీజేపీకి లింకులు ఉన్నాయంటూ ఆరోపించ‌డంతో పాటు దీనిపై ఎన్ఐఏ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేసింది.  

Congress protests in JammuKashmir: జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇటీవల అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాది ‘కమాండర్’ తాలిబ్ హుస్సేన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను కాంగ్రెస్ ప్రదర్శించింది. ఉగ్ర‌వాదుల‌తో బీజేపీ లింకులు ఉన్నాయంటూ ఆరోప‌న‌లు గుప్పించింది. కాంగ్రెస్ సోమవారం జమ్మూకాశ్మీర్ లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వహించి, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అలాగే, బీజేపీతో అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాది కమాండర్ తాలిబ్ హుస్సేన్ 'లింక్స్'పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాల‌ని డిమాండ్ చేసిందని ది హిందూ నివేదించింది. 

“బీజేపీ నేతల పాత్ర, హుస్సేన్‌తో వారికి ఉన్న సంబంధాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలి. ఆయన బీజేపీలో ఉండటం వల్ల అమర్‌నాథ్ యాత్రకు మాత్రమే కాకుండా పౌరులకు కూడా ముప్పు ఏర్పడింది. దేశ భద్రత విషయంలో బీజేపీ రాజీ పడింది' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ అన్నారు. నిరసన ర్యాలీకి నాయకత్వం వహించిన జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామన్ భల్లా మాట్లాడుతూ.. హుస్సేన్‌కు అందుబాటులో ఉన్న అంశాలు ఏమిటి. బీజేపీతో తన ఉనికిని ఉపయోగించి అతను ఏమి చేయాల‌నుకున్నాడు. ఏది విరమించుకున్నాడు అనే దానిపై సమగ్ర దర్యాప్తు దృష్టి పెట్టాలని అన్నారు. “బీజేపీ తన స్థాయిలలో ఉగ్రవాదులను ఎందుకు రిక్రూట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలి. బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉండి ప్రకటన ఇవ్వకుండా ఉన్నారు? మిస్టర్ షా కూడా హుస్సేన్‌తో దిగిన ఫొటోలు ఉన్నాయి” అని శ్రీ భల్లా ఆరోపించారు.

Scroll to load tweet…

ఈ సంవత్సరం పిర్ పంజాల్ లోయలో జరిగిన అనేక దాడుల వెనుక ఉన్నారని భావిస్తున్న ల‌ష్క‌రే తోయిబా కు చెందిన హుస్సేన్, అతని సహాయకుడు ఆదివారం స్థానిక గ్రామస్థుడి ఇంట్లో దాక్కున్నప్పుడు రియాసి టక్సన్‌లో స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. రాజౌరీలోని బుధాన్‌లోని ద్రాజ్ కొట్రంకకు చెందిన హుస్సేన్‌ను ఈ ఏడాది మేలో జమ్మూ ప్రావిన్స్‌లోని బీజేపీ మైనారిటీ మోర్చా ఐటి, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సోష‌ల్‌లో ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. రాజౌరి జిల్లాలో బీజేపీకి మీడియా కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారని ఆరోప‌ణ‌లు వినిపించాయి. 

Scroll to load tweet…

కాగా, ప‌ట్టుబ‌డిన హుస్సేన్ పార్టీలో క్రియ‌శీల‌క స‌భ్యుడు కాదు.. ప్రాథ‌మిక స‌భ్యుడు కాద‌ని రవీందర్ రైనా అన్నారు.