Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రెస్ మీట్లు.. 'హత్ సే హత్ జోడో' ప్రచారం షురూ !

New Delhi: భారత్ జోడో యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో కాంగ్రెస్ దీని ఉద్దేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుకెళ్ల‌డానికి మ‌రో యాత్ర‌ను ప్రారంభించ‌నుంది. 'హత్ సే హత్ జోడో' ప్రచారం షురూ చేసింది. దీనిలో భాగంగా బుధ‌వారం నాడు దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు నిర్వ‌హించాల‌ని  నిర్ణ‌యం తీసుకుంది. 'హత్ సే హత్ జోడో' లో భాగంగా జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. అనంతరం అన్ని రాష్ట్ర కేంద్రాల్లో భారీ ర్యాలీల్లో రాహుల్ గాంధీ పాలుపంచుకునేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
 

Congress press meetings across the country, Congress launches campaign for 'Hath Se Hath Jodo'
Author
First Published Jan 24, 2023, 2:00 PM IST

Congress Hath Se Hath Jodo: భారత్ జోడో యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో కాంగ్రెస్ దీని ఉద్దేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుకెళ్ల‌డానికి మ‌రో యాత్ర‌ను ప్రారంభించ‌నుంది. ఈ క్ర‌మంలోనే  'హత్ సే హత్ జోడో' ప్రచారం షురూ చేసింది. దీనిలో భాగంగా బుధ‌వారం నాడు దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు నిర్వ‌హించాల‌ని  నిర్ణ‌యం తీసుకుంది.  'హత్ సే హత్ జోడో' లో భాగంగా జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. అనంతరం అన్ని రాష్ట్ర కేంద్రాల్లో భారీ ర్యాలీల్లో రాహుల్ గాంధీ పాలుపంచుకునేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

వివ‌రాల్లోకెళ్తే.. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర సందేశాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన 'హత్ సే హత్ జోడో'కు ముందు కాంగ్రెస్ బుధవారం దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి పార్టీ 22 భార‌త్ జోడో యాత్ర చోట్ల విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని పేర్కొన్నాయి. జన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రతి ఇంటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జిషీట్ తో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాసిన సందేశ లేఖను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

2 నెలల పాటు కొనసాగనున్న  'హత్ సే హత్ జోడో'

భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో పర్యటించాలని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే హత్ సే హత్ జోడోస‌ లో యాత్ర‌కు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ పాల్గొంటారు. రెండు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, ఆరు లక్షల గ్రామాలు, 10 లక్షల బూత్ లను క‌వ‌ర్ చేసేలా కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది. కాంగ్రెస్ తన రాజకీయ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు చేపట్టిన కార్యక్రమమే హత్ సే హత్ జోడో అని స్ప‌ష్టం చేసింది.

నూటికి నూరు శాతం రాజకీయం.. : జైరాం రమేష్

'హత్ సే హత్ జోడో' కార్యక్రమం గురించి వివరిస్తూ పార్టీ ఎన్నికల గుర్తును, భారత్ జోడో యాత్ర రాజకీయ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున ఇది కష్టమైన పని అని ఆయన అంగీకరించారు, అయితే దీనిని పూర్తి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలే ఈ ప్రచారంలో తమ లక్ష్యమనీ, ఇది నూటికి నూరు శాతం రాజకీయమేనని అన్నారు.

హత్ సే హత్ జోడో లోగో విడుద‌ల‌

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర జ‌మ్మూకాశ్మీర్ కు చేరుకుంది. అయితే కాంగ్రెస్ ఇక్కడితో ఆగదని, భారత్ జోడో యాత్రలోనే ఆ పార్టీ దేశవ్యాప్తంగా 'హత్ సే హత్ జోడో' ప్రచారాన్ని ప్రారంభించనుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  కాంగ్రెస్ పార్టీ హత్ సే హత్ జోడో ప్రచారానికి సంబంధించిన లోగోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ శనివారం నాడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ కూడా జారీ చేసింది, ఇందులో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios