పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పీఓకేలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. మెరుపుదాడుల విషయం తెలుసుకున్న ఆయన ట్విట్టర్ ద్వారా సైన్యానికి అభినందనలు తెలియజేశారు.

‘‘ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్స్‌కు సెల్యూట్’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఎల్‌ఓసీ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చక్కర్లు కొట్టాయి.
అక్కడి జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 300 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు రక్షణశాఖ ప్రకటించింది.
Scroll to load tweet…