తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు సుధీర్ఘ జీవితం లభించాలని కోరుకుంటున్నా అంటూ ప్రధాని బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన రాహుల్ ‘థాంక్యూ మోడీజీ.. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు’’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. కాగా తమ అధినేత పుట్టినరోజును కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాయి. పలు పార్టీల అధినేతలు, కార్యకర్తలు, అభిమానులు రాహుల్ గాంధీకి సోషల్ మీడియా లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.