Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

congress president election polling begins Sonia Gandhi cast her vote at AICC headquarters
Author
First Published Oct 17, 2022, 11:07 AM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదివి కోసం పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 9 వేలకు పైగా పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరుగుతుంది. నేడు పోలింగ్ జరుగుతుండగా.. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో ఓటు వేయనున్నారు.  పీసీసీ ప్రతినిధులైన 40 మంది కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం మద్దతు మల్లికార్జున ఖర్గేకే ఉందన్న సంకేతాల నేపథ్యంలో.. ఆయన గెలుపు ఖాయంగా  కనిపిస్తుంది. 

అయితే నేడు శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈరోజు మల్లికార్జున ఖర్గేతో మాట్లానని.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాము సహచరులుగా, స్నేహితులుగా ఉంటామని తెలిపారు. 


తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ పీసీసీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ప్రతినిధులు ఓటు కర్నూలులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. ఇక, 24 ఏళ్ల తర్వాత గాంధీ కుబుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios