నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ వీడియోను పోస్టు చేసిన బీజేపీ ఆయన పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ నేతలు ప్రకాశ్ జావడేకర్ షాంపేన్ బాటిల్‌తో పార్టీ చేస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోపై బీజేపీ సమర్థకులు సోషల్ మీడియా వేదికగా దాడికి దిగిన సంగతి తెలిసిందే. అందుకు కాంగ్రెస్ సమాధానం చెబుతూనే వచ్చింది. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవడేకర్ ఫొటోనూ కాంగ్రెస్ పోస్టు చేసింది. బీజేపీ ఇచ్చిన దెబ్బకు కాంగ్రెస్ మరో దెబ్బ తీసినట్టయింది.

కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ప్రకాశ్ జవడేకర్ షాంపేన్ బాటిల్‌ను పట్టుకున్న ఫొటోనూ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎవరో ఒకసారి గుర్తుపట్టండని క్యాప్షన్ పెట్టారు. 

Scroll to load tweet…

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఓ నైట్ క్లబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ వీడియోను ఎప్పటిదనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ వీడియోను షేర్ చేసిన నేతల్లో బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి నైట్ క్లబ్‌ల వెంట తిరగమేమిటని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై విమర్శలు ప్రారంభించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ పబ్‌లో ఉన్నట్టుగా చెబుతున్న వీడియో బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. ‘‘దేశంలో సంక్షోభం ఉంది, కానీ 'సార్' విదేశాలలో ఉండటానికి ఇష్టపడతాడు!’’ అని పేర్కొంది.

రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత Randeep Surjewala మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ గాంధీ నేపాల్‌ వెళ్లాడని తెలిపారు. ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదని అన్నారు. ప్రధాని మోదీలాగా రాహుల్‌ ఆహ్వానం లేని అతిథిగా పాకిస్థాన్‌కు వెళ్లలేదని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ రాహుల్ గాంధీ ప్రైవేట్ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి మిత్రదేశమైన నేపాల్‌కు వెళ్లారని చెప్పారు. 

విద్యుత్ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని సుర్జేవాలా ప్రశ్నించారు. వారు రాహుల్ గాంధీకి మాత్రం మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఆరెస్సెస్‌పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరెస్సెస్.. కుటుంబాన్ని కలిగి ఉండటాన్ని విభేదించవచ్చే వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

ఇక, బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధఈ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యాడని.. అందులో తప్పేముందని ప్రశ్నించాురు. ఆయన గురించి సంఘీలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సంఘీలు అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. మనందరం కూడా ప్రైవేటు ఫంక్షన్లకు హాజరవుతామని పేర్కొన్నారు. రాహుల్‌ వీడియోను బీజేపీ వైరల్ చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.