న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఆర్ఎస్ఎస్ నేతలకు ఉందని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా దుయ్యబుట్టింది. దేశంలో డమ్మీలతో పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

హింసను ప్రేరేపించడం ఆర్ఎస్ ఎస్ కు అలవాటు అంటూ విమర్శించింది. అల్లర్లను రెచ్చగొట్టి జాతిపిత మహాత్మగాంధీని హత్య చేయించింది ఆర్ఎస్ఎస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ మద్దతు పలికిందని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఆర్ఎస్ఎస్ పై మహారాష్ట్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ పై తన సైద్ధాంతిక పోరాటం కొనసాగుతోందని తెలిపారు. గౌరీలంకేష్ హత్యపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. 

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గమనార్హం.