Asianet News TeluguAsianet News Telugu

కుమారస్వామి హెచ్చరిక...కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.బిజెపిని ఎదుర్కోడానికి కలిసిపోయిన కాంగ్రెస్-జేడిఎస్ పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జేడిఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కుమార స్వామిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమ సంకీర్ణ బంధాన్ని దెబ్బతీసేలా ఉండటం సీఎం కుమార స్వామి సీరియస్ అయ్యారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అదిష్టానం చర్యలకు సిద్దమైంది.

congress party issued shokaz notice to mla somashekhar
Author
Karnataka, First Published Jan 28, 2019, 4:56 PM IST

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.బిజెపిని ఎదుర్కోడానికి కలిసిపోయిన కాంగ్రెస్-జేడిఎస్ పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జేడిఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కుమార స్వామిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమ సంకీర్ణ బంధాన్ని దెబ్బతీసేలా ఉండటం సీఎం కుమార స్వామి సీరియస్ అయ్యారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అదిష్టానం చర్యలకు సిద్దమైంది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సోమశేఖర్ సీఎం కుమార స్వామిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ సీఎం కుమార స్వామి కాదని...గతంలోనూ, ఇప్పుడూ సిద్దరామయ్యే తమ సీఎం అంటూ అతడు వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన ఆదేశాలనే పాటిస్తారంటూ సోమశేఖర్ స్పష్టం చేశాడు.   

కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం కుమార స్వామి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ అదిష్టానం వారిని అదుపు చేయకుంటూ తాను వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తమ సంకీర్ణ బంధానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని గ్రహించిన కాంగ్రెస్ అదిష్టానం సోమశేఖర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పార్టీని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సోమశేఖర్ కు క్రమశిక్షణ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వేణుగోపాల్ ఆదేశించారు. ఈ వ్యాఖ్యలపై అతడి నుండి  వివరణ కోరాల్సిందిగా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర  కాంగ్రెస్ కూడా సోమశేఖర్ కు నోటీసులు జారీ చేసింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios