ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.. ప్రజాస్వామ్యం కాదు : జేపీ నడ్డా
Molakalmuru: "దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంది.. ప్రజాస్వామ్యం కాదు" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ బహిరంగ సభలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర మంత్రులు ఆర్ అశోక, బీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

BJP national President J P Nadda: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. "దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంది.. ప్రజాస్వామ్యం కాదు" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ బహిరంగ సభలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర మంత్రులు ఆర్ అశోక, బీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే తప్ప ప్రజాస్వామ్యం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నారని మండిపడుతూ.. అలాంటి వారిని ఇంట్లో కూర్చోబెట్టాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మానసిక దివాళాకోరుతనం దిశగా పయనిస్తున్న తీరు గర్హనీయం, బాధాకరమన్నారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యకలాపాలు, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న పనులు ఖండించదగినవని జేపీ నడ్డా అన్నారు. కర్నాటకలోని మొలకల్మూరులో జరిగిన హిహరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి, కమీషన్, క్రిమినైజేషన్ కు పాల్పడుతున్నారనీ, విభజించి పాలించడమే తమ విధానమంటూ పేర్కొన్నారు.
"ఇప్పుడు వారు (కాంగ్రెస్) అన్ని హద్దులు దాటారు.... రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ వెళ్లి భారత సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందనీ, ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగాలాండ్ లో కాంగ్రెస్ సున్నా, మేఘాలయలో ఐదు, త్రిపురలో మూడు స్థానాలు గెలుచుకుంది. ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. మీ పార్టీ (కాంగ్రెస్) ప్రమాదంలో ఉంది" అంటూ జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ 'విజయ సంకల్ప యాత్ర'లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మొలకల్మూరు సభకు వచ్చారు. భారత ప్రజాస్వామ్య నిర్మాణాలు క్రూరమైన దాడికి గురవుతున్నాయని లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, రాహుల్ పై మండిపడ్డారు.
భారత్ లో ప్రజాస్వామ్య సమస్యపై అమెరికా, యూరప్ దేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ కోరుతున్నారని, అలాంటి నాయకులను రాజకీయాల్లో ఉండనివ్వాలా? అని ప్రశ్నించారు. వారిని ఇంట్లోనే కూర్చోబెట్టాలంటూ ప్రజలను కోరారు. రాహుల్ గాంధీ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం గురించి బోధించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని నడ్డా గుర్తు చేశారు.
దేశంలో రాజకీయ సంస్కృతిని మార్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రాజకీయాలు అవినీతి, కమీషన్, క్రిమినలైజేషన్, వంశపారంపర్య పాలన అంటూ విమర్శించారు. బాధ్యతాయుతమైన నాయకత్వంతో ప్రధాని దేశంలో రిపోర్ట్ కార్డు రాజకీయాలను ప్రారంభించారని నడ్డా అన్నారు. ప్రజలకు సేవ చేయాలని విశ్వసించే బలమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ స్థాపించారని చెప్పారు. ఇది సరికొత్త ఇండియా అంటూ.. భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఆటోమొబైల్, డిజిటల్ చెల్లింపులు, మొబైల్ ఫోన్ తయారీ వంటి రంగాలలో వృద్ధిని గురించి వివరించారు.