ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కెల్లా తీవ్ర ఉత్కంఠ రేపిన కేంద్రం మధ్యప్రదేశ్. ఏ పార్టీకి విజయాన్ని అందించకుండా చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ ఫలితాలు ఎవరికి విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. గంట గంటకు కాంగ్రెస్, బీజేపీలకు ఆధిపత్యాన్ని కట్టబెట్టి చివరి నిమిషంలో ఎటు కాకుండా పోయింది.

మంగళవారం రాత్రికి విడుదలైన తుది ఫలితాల్లో బీజేపీ 109, కాంగ్రెస్ 114, బీఎస్పీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు.     హంగ్ అసెంబ్లీ దాదాపుగా ఖరారు కావడంతో స్వతంత్రులు, బీఎస్పీ మద్ధతు కూడగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి.

అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిసింది. మరోవైపు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఫోన్ చేసి మద్ధతుపై చర్చించినట్లుగా సమాచారం. ఈ వ్యూహం ఫలించని నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.