కర్ణాటకలో రాజకీయ సెగ లోక్‌సభను తాకింది. ఉదయం సభ ప్రారంభమవడానికి ముందే కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం స్పీకర్ సభ ప్రారంభించిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ వారు నినాదాలు చేశారు. ఎంతగా వారించినప్పటికీ వారు సంయమనం పాటించకపోవడంతో స్పీకర్ ఓమ్ బిర్లా సభను గంట సేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.