కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీకా ఉత్సవాల పేరుతో జరిగినదంతా బూటకమని ఆయన మండిపడ్డారు. కరోనాను నిర్థారించేందుకు పరీక్షలు జరగడం లేదని, ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవని రాహుల్ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీకా ఉత్సవాల పేరుతో జరిగినదంతా బూటకమని ఆయన మండిపడ్డారు. కరోనాను నిర్థారించేందుకు పరీక్షలు జరగడం లేదని, ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పీఎం-కేర్స్ నిధి ట్రస్ట్ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు.
ఆసుపత్రుల్లో పరీక్షలు జరగడం లేదని.. పడకలు లేవని వెంటిలేటర్లు, ఆక్సిజన్ లేవు. వ్యాక్సిన్లు కూడా లేవని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వీటిని ప్రధాన మంత్రి పట్టించుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
కాగా, దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 14 వరకు కోవిడ్-19 నిరోధక టీకాలు వేసే కార్యక్రమం టీకా ఉత్సవ్ జరిగింది. ప్రధాన మంత్రీస్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం-కేర్స్) నిధికి భారీగా విరాళాలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:విజృంభిస్తోన్న కరోనా: మహారాష్ట్ర బాటలో ఢిల్లీ.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం
మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆసుపత్రుల్లో తగినన్ని పడకలు లేవని, వెంటిలేటర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
కాగా, 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,00,739 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి భారత్‌లో వెలుగు చూసిన నాటి నుంచి ఒక రోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మన దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,40,74,564. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,71,877.
