కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించడానికి కూడా కేంద్రానికి సమయం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. 

నిరసనల సందర్భంగా ఇప్పటి వరకు 300 మంది రైతులు మరణించారని, వారికి కనీసం 2 నిమిషాలు మౌనం పాటించే సమయం కూడా కేంద్రానికి లేదా? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ మేరకు ‘300DeathsAtProtest' అన్న హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. ‘‘నిరసనల సందర్భంగా మరణించిన రైతులకు రెండు నిమిషాలు మౌనం పాటించడానికి కూడా బీజేపీకి ఆమోదయోగ్యం కాదు.

నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తన వంతుగా నివాళులర్పిస్తున్నానని రాహుల్ చెప్పారు. తన మౌనానికి కూడా భయపడే వారికి నేను భయపడనంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…