గుండెపోటుతో కాంగ్రెస్ నేత కన్నుమూసిన సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది.  బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ మౌలానా అస్రావుల్‌ హక్‌ ఖాస్మి శుక్రవారం కన్నుమూశారు. తన నివాసంలోనే గుండెపోటుతో ఆయన మృతిచెందారు.

ఆయన మృతి పట్ల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ ఏర్పాటులో అస్రావుల్‌ కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. జమాయత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడైన హక్ ఎంపీగా 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ముస్లిమ్ మైనారిటీల సమస్యలపై పార్లమెంటులో హక్ తన గళాన్ని వినిపించారు.