Asianet News TeluguAsianet News Telugu

పిల్లలన్నప్పుడు తాగుతారు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకుంటారా? పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

వాళ్లు పిల్లలు.. తాగుతారు.. తరచూ తప్పులు చేస్తుంటారు.. తాగి వాహనం నడిపినందుకు అరెస్టు చేస్తారా? వెంటనే విడుదల చేయండి అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తిరస్కరించడంతో స్టేషన్‌లోనే నేలపై కూర్చుని ధర్నా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

congress MLA sits dharna in police station to release drunk and drive nephew
Author
Jaipur, First Published Oct 19, 2021, 3:21 PM IST

జైపూర్: పిల్లలన్నప్పుడు తాగుతారు.. అందరి పిల్లలూ తాగుతారు.. తరుచూ తప్పులు చేస్తారు.. వాటన్నింటినీ పట్టించుకోవద్దు.. చూసి చూడనట్టు వదిలిపెట్టాలి.. Drunk and Drive కింద అరెస్టు చేసిన మా బంధువు పిల్లాడిని వెంటనే వదిలిపెట్టాలి.. పోలీసులతో వాదిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలివి. తమ బంధువుల పిల్లాడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు. అతడిని వదిలిపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులతో వాదనలకు దిగారు. పోలీసులు తిరస్కరించడంతో రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వార్, భర్త ఉమైద్ సింగ్‌లు స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. ఈ క్రమంలో వారి మాటలను ఓ పోలీసు అధికారి రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

Rajasthanలోని రతనాడ Police Stationకు Congress MLA మీనా కున్వార్ వెళ్లారు. తమ బంధువు పిల్లాడిని వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కానీ, పోలీసులు అందుకు తిరస్కరించారు. దీంతో అక్కడే స్టేషన్‌లో నేలపై కూర్చోని ధర్నా చేశారు. పిల్లలు తాగుతుంటారని, అది పెద్ద సమస్య కాదని ఎమ్మెల్యే, ఆమె భర్త తెలిపారు. పిల్లాడిని వదిలిపెట్టాలని తాను రిక్వెస్ట్ చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. రిక్వెస్ట్ చేసిన రికార్డు కూడా తన దగ్గర ఉన్నదని పేర్కొన్నారు. కాగా, ఆ వీడియో మొత్తం ఎమ్మెల్యే భర్త ఫోన్ పట్టుకునే ఉన్నాడు.. ఫోన్ మాట్లాడుతూనే ఉన్నట్టు కనిపించాడు. కానీ, పోలీసులతోనూ వాదానికి దిగారు.

Also Read: వామ్మో.. అదేం డ్రైవింగ్ బాబోయ్.. కారు బానెట్‌పై పోలీసు ఎక్కి కూర్చున్నా ఆపని డ్రైవర్.. వీడియో వైరల్

మర్యాదగా మాట్లాడాలని పోలీసులు ఎమ్మెల్యే భర్త ఉమైద్ సింగ్‌ను సూచించగా, ఆయన మరింత ఆగ్రహించారు. అలా మాట్లాడకుంటే ఏం చేస్తావని బెదిరించారు. నిన్ననే ఈ స్టేషన్‌లోని కొందరు పోలీసులు సస్పెండ్ అయిన విషయం మీకు తెలుసు కదా? మీరు మరిచిపోయారా? అని హెచ్చరించారు. ఈ ఘటనంతా ఓ పోలీసు అధికారి రికార్డు చేస్తుండగా ఎమ్మెల్యే మీనా కున్వార్ పరిశీలించారు. వెంటనే వీడియో రికార్డింగ్ బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొందరైతే కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios