Asianet News TeluguAsianet News Telugu

పార్టీ మారితే రూ.30 కోట్లు, మంత్రి పదవి....హైదరాబాద్ లోనే ఢీల్ : ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కన్నడికులనే కాదు యావత్ దేశ ప్రజల్లోనూ ఉత్కంట రేపిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీల క్యాంపులతో కన్నడ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించాయి. చివరకు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  అయితే బలనిరూపణ సమయంలో ఎమ్మెల్యేలు జారిపోకుండా సంకీర్ణ ప్రభుత్వం మరోసారి హైదరాబాద్ లో క్యాంపు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలోనే బిజెపి పార్టీ తనతో బేరసారాలు చేసిందని ఓ మహిళా ఎమ్మెల్యే బైటపెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ లో  భాగంగా తనతో సంప్రదించారంటూ ఎమ్మెల్యే సంచలన విషయాలు వెల్లడించారు.

congress mla sensational comments on bjp
Author
Karnataka, First Published Sep 29, 2018, 11:43 AM IST

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కన్నడికులనే కాదు యావత్ దేశ ప్రజల్లోనూ ఉత్కంట రేపిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీల క్యాంపులతో కన్నడ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించాయి. చివరకు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  అయితే బలనిరూపణ సమయంలో ఎమ్మెల్యేలు జారిపోకుండా సంకీర్ణ ప్రభుత్వం మరోసారి హైదరాబాద్ లో క్యాంపు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలోనే బిజెపి పార్టీ తనతో బేరసారాలు చేసిందని ఓ మహిళా ఎమ్మెల్యే బైటపెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ లో  భాగంగా తనతో సంప్రదించారంటూ ఎమ్మెల్యే సంచలన విషయాలు వెల్లడించారు.

బిజెపి పార్టీలో చేరడానికి తనకు రూ. 30 కోట్లు ఆఫర్ చేయడంతో పాటు అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ నాయకులు ఆశ చూపారని బెళగావి గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్‌ ఆరోపించారు. తాను హైదరాబాద్ లో ఉండగా తనకు బిజెపి పార్టీకి చెందిన ఓ కీలక నేత ఫోన్ చేసి బిజెపికి మద్దతివ్వాలని కోరినట్లు లక్ష్మి వెల్లడించారు.  

కేవలం ఫోన్ మాత్రమే కాదు... బిజెపి పార్టీలో చేరితే మీకు ఏమేం లభిస్తాయో చూడండంటు మెసేజ్ కూడా పంపించినట్లు అమె పేర్కొన్నారు. అయితే తాను వారి ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు ఈ విషయాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వరన్ దృష్టికి తీసుకెళ్లినట్లు లక్ష్మి వెల్లడించారు. ఇలా అధికారం కోసం ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి బిజెపి అనైతికంగా ప్రవర్తించిందంటూ లక్ష్మి హెబ్బాల్కర్‌ సంచలన విషయాలు బైటపెట్టారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios