ఒడిశా అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా.. ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యలను సభలో వినిపిస్తున్నారు.

కాగా.. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పని సభలో అందరిచేత పువ్వులు పూయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి.. స్పీకర్ ఎస్ఎన్ పాట్రోకి ముద్దు ఇచ్చారు.

ఎమ్మెల్యే తారా ప్రసాద్.. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ స్పీకర్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు.  అనంతరం తాను స్పీకర్ ని కించపరచడానికి అలా చేయలదేని క్లారిటీ కూడా ఇచ్చారు.

తమ నియోజకర్గంలో వెనుకబడిన కులాల వారి ఉన్నతి కోసం ఆయన చూపిన శ్రద్ధ తనకు ఎంతగానో నచ్చిందని అందుకే దన్యవాదాలు చెబుతూ.. ప్లైయింగ్ కిస్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. మొత్తం 147మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా.. తనకే మొదట మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని అందుకు మరోసారి దన్యవాదాలు తెలిపారు.