కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు. మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంట్లో జీ 23 నేతలు ఇవాళ సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలుగా ముద్రపడిన G-23 నేతలు బుధవారం నాడు రాత్రి మాజీ కేంద్ర మంత్రి Ghulam Nabi Azad ఇంట్లో సమావేశమయ్యారు.
గత ఆదివారం నాడు CWC సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై Congress పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జీ 23 నేతలు డిమాండ్ చేశారు. దీంతో గత ఆదివారం నాడు సమావేశాన్ని నిర్వహించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. అయితే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి గాంధీ కుటుంబ సభ్యులు తప్పుకోవాలని Kapil sibal కోరారు.ఈ వ్యాఖ్యలపై మల్లికార్జునఖర్గే వంటి నేతలు మండి పడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ రాత్రి ఆజాద్ నివాసంలో జీ 23 నేతలు సమావేశమయ్యారు. జీ 23 నేతలకు మరికొందరు కూడా తోడయ్యే అవకాశం కూడా లేకపోలేదనే ప్రచారం సాగుతుంది.
2021 అక్టోబర్ మాసంలో CWC సమావేశమైంది. ఆ సమావేశం తర్వాత గత ఆదివారం నాడు సీడబ్ల్యూసీ భేటీ అయింది. సీడబ్ల్యుసీలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు. ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎఐసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత ఇవాళ మరోసారి వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జీ 23 సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ, భూపేందర్ హుడా, అఖిలేష్, ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులున్నారు. ఈ సమావేశం కపిల్ సిబల్ నివాసంలో జరగాల్సి ఉంది. అయితే కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి గాంధీ కుటుంబం తప్పుకోవాలని డిమాండ్ చేయడంతో సమావేశం వేదికను గులాం నబీ ఆజాద్ నివాసానికి మార్చారు.
