సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అణగారిన వర్గాల బాధను అర్థం చేసుకుని వారి కోసం పోరాడారు. ఆయన మృతి పట్ల దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.కోట్లాది ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను భారతరత్నతో సత్కరించాలని కోరుతున్నాను అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. గత ఆరు దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్‌కు,దేశానికి ములాయంసింగ్ యాదవ్ ఎన్నో సేవలందించారు. పేద-ధనిక, హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ ఒకే తాటిపై నడిపించడానికి ఆయన కృషి చేశారని అన్నారు. సామ్యవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సామాజిక న్యాయం కోసం ఆయన ఎప్పుడూ పోరాడారనీ, ఆయన చేసిన పోరాటం, దేశం కోసం చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని, ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని, అదే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అలాగే.. ములాయం సింగ్ యాదవ్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రధానికి కూడా లేఖ రాశారుమహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ కూడా . బల్లియాకు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి వీరేంద్ర సింగ్ గత నెలలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ జ్ఞాపకార్థం ఆడిటోరియం నిర్మాణానికి తన ఎంపి నిధుల నుండి రూ.25 లక్షలను మంజూరు చేశారు.

ప్రతిపాదిత ఆడిటోరియం బల్లియా జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించబడుతోంది . దానికి "ధర్తిపుత్ర ములాయం సింగ్ యాదవ్ సంవాద్ భవన్" అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కేంద్ర రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అభిమానులు ఆయన్ను ముద్దుగా "నేతాజీ" అని పిలిచేవారు.