Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ లో హీటెక్కిన‌ పొలిటిక‌ల్ వార్ .. కూల్ గా పుట్ బాల్ ఆడుతున్న రాహుల్ 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవికి పోరు సాగుతున్నాయి. కానీ, కేరళలోని పాలక్కాడ్‌లో కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'లో రాహుల్ గాంధీ పిల్లలతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.   

Congress Leader Rahul Gandhi Plays Football With Children During Congress Bharat Jodo Yatra In Palakkad
Author
First Published Sep 27, 2022, 6:10 AM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవికి పోరు సాగుతున్న పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ మాత్రం నాకేమీ తెలియ‌నట్టుగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెలువెతున్నాయి. వాస్తవానికి .. భార‌త్ జోడో యాత్ర సోమ‌వారం నాడు కేరళలోని పాలక్కాడ్‌లో సాగింది. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. దీంతో రాజ‌కీయ ప‌రంగా విమ‌ర్శ‌లు వెలువెత్తున్నాయి. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముంది..? 

ఇటు ఢిల్లీ,  అటు రాజస్థాన్‌లలో రాజకీయ గందరగోళం నెల‌కొన్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి టెన్షన్ ప‌డ‌కుండా..  భార‌త్ జోడో  యాత్ర‌లో పిల్లలతో ఫుట్‌బాల్ ఆడారు. వారితో క‌లిసి స‌రదాగా ముచ్చటించారు. ఆయ‌న కొంత‌మంది చిన్న పిల్ల‌ల‌తో నడుచుకుంటూ పుట్ బాల్ ఆడుతుండ‌టం,   కొన్నిసార్లు రాహుల్ గాంధీ కూడా పిల్లలతో మాట్లాడుతూ, కొన్నిసార్లు అతను తన చేతిలో ఫుట్‌బాల్ విసిరినట్లు  వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.  ఇందుకు సంబందించిన ఓ వీడియో  వైరల్ అవుతోంది. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో రాహుల్ గాంధీపై కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. 

ఇటు ఢిల్లీ,  అటు రాజస్థాన్ ల్లో రాజకీయ గందరగోళం నెల‌కొన్న త‌రుణంలో రాహుల్ దూరంగా ఉన్నారని విమ‌ర్శిస్తున్నారు. సంక్షోభం నేప‌థ్యంలో రాహుల్ ప్రస్తుతానికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా.. చిన్న‌పిల్ల‌ల‌తో ఆడుకుంటున్నారని విమ‌ర్శించారు.

వాస్త‌వానికి ..  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం(19వ రోజు) కేరళలోని పాలక్కాడ్ జిల్లా షోరనూర్ లో ప్రారంభ‌మైంది. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. ఈరోజు మొత్తం 12.3 కి.మీ మేర ఈ పాదయాత్ర సాగింది.  

రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం 

రాజ‌స్థాన్ లో ఆదివారం రాత్రి కీలక ప‌రిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు రోజు..  అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన పలువురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌ను తదుపరి సీఎంగా నియమించే అవకాశం ఉందని రాజీనామాలు సమర్పించారు. గెహ్లాట్ వారసుడిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 90 మంది ఎమ్మెల్యేల బృందం రాజీనామాలు సమర్పించింది.

గెహ్లాట్‌కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు అర్థరాత్రి కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, అజయ్‌ మాకెన్‌లు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో, ఇప్పుడు మేం ఏమీ చేయలేమని గెహ్లాట్ కూడా స్పష్టంగా చెప్పారు. గెహ్లాట్ తన సీఎం పదవిని వదులుకోవడానికి మొదట సిద్ధంగా లేరు. తరువాత, తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన పైలట్‌కు బదులుగా స్పీకర్ సీపీ జోషిని ముఖ్యమంత్రిగా చూస్తారని ఊహాగానాలు వచ్చాయి.

 భారత్ జోడో యాత్రలో భాగంగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు పాదయాత్రలో పాల్గొంటారని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర సెప్టెంబర్ 30న కర్ణాటకలో ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ ప్రతిరోజూ వందలాది మందిని కలుస్తున్నారు, కాంగ్రెస్ మిత్ర సంస్థలు కూడా ఇందులో చాలా చురుకుగా పాల్గొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios