గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం బీజేపీని టార్గెట్ చేశారు. మోర్బీ బ్రిడ్జి ఘటన గుజరాత్ పేరుకే తలవంపులు తెచ్చిందని అన్నారు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని అన్నారు. 

గుజరాత్‌లో రాజకీయం రోజురోజుకు వేడ్కెతోంది. ఎన్నిక ప్రచారంలో మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనను ప్రధాన అంశంగా చేసుకోని ప్రతిపక్షలు అధికార బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషాదంపై బీజేపీని కాంగ్రెస్‌ టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించింది. మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం కూడా బీజేపీపై దాడి చేశారు. మోర్బీ ప్రమాదం గుజరాత్ ప్రతిష్టకు తలవంపులు తెచ్చిందని అన్నారు.

ప్రభుత్వ పక్షం నుంచి ఇప్పటివరకూ క్షమాపణలు చెప్పకపోవడం అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామమని అన్నారు. ఈ ఘటనను నేపథ్యంలో ఎవరూ బాధ్యత వహించి రాజీనామా చేయలేదని మండిపడ్డారు. అలాగే.. గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి ముఖ్యమంత్రి నడపడం లేదని, దానిని ఢిల్లీ నిర్వహిస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో.. చిదంబరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తాను బతికినంత కాలం ఢిల్లీలో బతికే ఉన్నాననీ,ఢిల్లీలో గాలి నాణ్యతపై నమ్మకం ఉంటే గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేయరని అన్నారు. 

గతంలో మోర్బీ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని దుయ్యబట్టారు. గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి కుప్పకూలింది మోదీ ఆకర్షణ వల్లేనా అని ఖర్గే ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం బెంగాల్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఖర్గే గుర్తు చేశారు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయి చాలా మంది చనిపోయారు. బెంగాల్‌లో వంతెన కూలడం అక్కడి ప్రజల కళ్లు తెరిపించేందుకు 'దేవుని చర్య'అని అప్పుడు ప్రధాని చెప్పారని ఖర్గే అన్నారు. ఇప్పుడు ఇక్కడ (మోర్బీలో) వంతెనను ఎవరు బద్దలు కొట్టారు? అని ప్రశ్నించారు. మరోవైపు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.స్వతంత్ర అభ్యర్థి మొదటి ఫారమ్‌ను దాఖలు చేశారు.

గుజరాత్ హైకోర్టు నివేదిక

మరోవైపు మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హోం శాఖ, అర్బన్ హౌసింగ్, మోర్బీ మున్సిపాలిటీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణ నవంబర్ 14న జరగనుంది. మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో 135 మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు.