కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాల సీఎంలకు రాసిన లేఖల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు సంధించారు. టీకాల సరఫరా అంశంపై ప్రధాని మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. జగన్‌ లేఖలు రాసినట్లుగా వచ్చిన వార్త లింక్‌ను జైరాం రమేశ్ పోస్ట్‌ చేశారు.

టీకా సమస్యను యూనియన్ వర్సెస్ స్టేట్స్ ఎవరు చేశారు? 18-44 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకుంటుందని ఏకపక్షంగా ఎవరు నిర్ణయించారు? ఈ విధానాన్ని రూపొందించడానికి ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించ లేదు? ఈ ప్రశ్నలను మీరు మోడీని ఎందుకు అడగకూడదు అంటూ జైరాం ట్వీట్ చేశారు. అంతకుముందు సీఎంలకు రాసిన లేఖలో వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్ల వ్యవహారంపై జగన్ లేఖలో ప్రస్తావించారు.

Also Read:వ్యాక్సిన్‌పై గ్లోబల్ టెండర్లు: ఆమోదం కేంద్రం చేతుల్లోనే.. ఒకే మాట మీద వుందాం, రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ

రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల లభ్యతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు.. అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్‌పై ఉండాలని జగన్ కోరారు. వ్యాక్సిన్ కోసం  గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎంకు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో వుందని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యతలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లు పరిస్ధితి మారుతోందని జగన్ వ్యాఖ్యానించారు.