Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభలో నిద్రపోయిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. వీడియో వైరల్..

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ పార్లమెంట్ లో కునుకు (Congress leader Digvijay Singh fell asleep in Parliament) తీశారు. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో (Mallikarjun Kharge) రాజ్యసభలో ప్రసంగిస్తుండగానే ఆయన నిద్రపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral)గా మారింది.

Congress leader Digvijay Singh fell asleep in Rajya Sabha..Snored while Mallikarjun Kharge was speaking..Video viral..ISR
Author
First Published Feb 2, 2024, 3:36 PM IST

పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి నిరసనగా శుక్రవారం ప్రతిపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అదే సమయంలో రాజ్యసభలో విపక్షాల ఎంపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఇదిలా ఉండగా.. రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని వింటూ నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ఆయన వెనకాలే కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కూర్చున్నారు. అయితే ఖర్గే స్పీచ్ బోర్ కొట్టిందో తెలియదు గానీ దిగ్విజయ్ సింగ్ కు నిద్ర కమ్ముకొచ్చింది. కళ్లు తెరిచేందుకు ఎంతో ప్రయత్నించినా.. ఆయన వల్ల కాలేదు. అందుకే ఓ మోచేతిని టేబుల్ పై ఉంచి, అరచేతిపై ముఖాన్ని వాల్చారు. తలదించుకొని కునుకు తీశారు. 

పొలిటికల్ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి.. ఎలక్షన్ కమిషన్ లో పేరు రిజిస్ట్రేషన్..

ఈ 28 సెకన్ల వీడియోలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పలు రంగాల్లోకి ప్రభుత్వం ప్రవేశించినప్పుడే దేశం బాగుపడిందని చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు రంగం మన బ్యాంకుల నుంచే రుణాలు తీసుకొని, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ డబ్బు తీసుకొని కూడా పేదలకు పని కల్పించరని ఆరోపించారు. వారి బంధువులను, సమాజంలోని వ్యక్తులను, వారికి సన్నిహితంగా ఉన్నవారిని మాత్రమే తీసుకుంటారని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios