Anand Sharma: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ గురువారం తోసిపుచ్చారు. అలాగే ఈ రూమర్‌ని గౌరవిస్తానని అన్నారు.
Anand Sharma: రాజకీయ అనుభవజ్ఞుడు, అసమ్మతి కాంగ్రెస్ నేతల బృందం సభ్యుడు ఆనంద్ శర్మ గురువారం సాయంత్రం BJP చీఫ్ JP నడ్డాతో సమావేశమయ్యారు, దీంతో ఆయన కాషాయ శిబిరంలో చేరుతాడనే ఊహాగానాలకు ఆజ్యం పోసినట్టు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు ఈ సమావేశం జరిగింది, ఆనంద్ శర్మ.. ఇక్కడ నుండే పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఆనంద్ శర్మ బీజేపీలో చేరడంపై చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కానీ.. ఈ వాదనలను ఆనంద్ శర్మ ఖండించారు. బిజెపి చీఫ్ జెపి నడ్డానే కాదు.. ఇతర పార్టీ నేతలను కూడా కలిసే హక్కు ఉందని , నాకు ఆయన బీజేపీ అధ్యక్షుడు కాదు, మేమిద్దరం ఒకే రాష్ట్రం నుండి వచ్చాము.. వారి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు.
నడ్డాను కలవడంతో విశేషం ఏముంది ? తాను కాంగ్రెస్‌కు చెందినవాడిననీ, ఆయన బీజేపీకి చెందిన వారు. ఇరువురి పార్టీల మధ్య సైద్ధాంతిక భేదాలు ఉండటం వల్ల. రాజకీయ ప్రత్యర్థులమని అన్నారు. కానీ
తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకోచ్చారు.
G-23లో కీలకమైన సభ్యుడు ఆనంద్ శర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అనేక సార్లు తన అసంతృప్తిని చాలాసార్లు బహిరంగంగా వ్యక్తం చేశారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, సమీకరణాలపై కూడా చర్చలు జరిగాయి.
ఆనంద్ శర్మ జి 23 వర్గంలో చేరి పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా పార్టీ ఆయనను అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే అసంతృప్తిని చల్లార్చేందుకు పలుమార్లు అగ్రనాయకత్వంతో సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి అధిపతిగా ఉన్నారు. కొన్ని నెలల తర్వాత హిమాచల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అ క్రమంలో బీజేపీ చీఫ్ నడ్డాతో బేటీ కావడం సర్వత్రా చర్చనీయంగా మారింది.
