కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పలువురు ప్రస్తావిస్తూ ఉంటారు. రాహుల్ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారనే? వార్త చాలా ఏళ్లుగా పలు సందర్భాల్లో తెరమీదకు వస్తూనే ఉంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పలువురు ప్రస్తావిస్తూ ఉంటారు. రాహుల్ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారనే? వార్త చాలా ఏళ్లుగా పలు సందర్భాల్లో తెరమీదకు వస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ మీద రాహుల్ గాంధీ ఫొటో కనిపించడం చాలా మంది కాంగ్రెస్ నాయకులను ఉప్పొంగిపోయేలా చేస్తుంది. అయితే అది రాహుల్ జీవితంలో ఎంతో మంది ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఘట్టం(పెళ్లి) గురించి అయితే కాదు. మొత్తం 4 పేజీలతో కూడిన ఆ ఇన్విటేషన్‌లో.. మొదటి పేజీలో రాహుల్ గాంధీ ఫోటోను ఉంచారు. 

రెండవ పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నవ్వుతున్న పూర్తి ఫోటో ఉంది. మూడో రాహుల్ తల్లి సోనియా గాంధీ ఫోటోను ఉంచారు. ఇక, నాలుగో పేజీని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్‌కి కేటాయించారు. అయితే ఈ ఇన్విటేషన్ ఎవరిదని అనుకుంటున్నారా?.. అయితే ఇన్విటేషన్ కార్డ్‌పై ఉన్న ఫొటోలను పట్టించుకోకుండా మెసేజ్‌ని చదవగానే రాహుల్ ‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’’గా కొనసాగుతారని మీకు అర్థమవుతుంది.

అది తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెఎస్ అళగిరి కుమార్తె కాంచన వివాహ రిసెప్షన్‌కు చెందిన ఆహ్వానం. ఆమె వినోద్ రంగనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోనున్నారు. అయితే వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్‌‌లో అళగిరి ఫొటో లేదని అనుకుంటున్నారా?.. అయితే మొదటి పేజీలో రాహుల్ గాంధీ ఫోటో కింద ఆయన చిన్న ఫోటోను చూడొచ్చు.