జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను రద్దు చేసేందుకు 2019 ఆగస్టు 5న మోదీ ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ విమర్శించారు.
దేశరాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ కన్వీనర్,ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఈ ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వకపోతే.. విపక్షాల సమావేశాన్ని తాము బహిష్కరించాలని విపక్షాలు హెచ్చరించడం. ప్రధానంగా కాంగ్రెస్ ఒత్తిడి చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ పై విమర్శాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెర మీదికి వచ్చాయి. కేజ్రీవాల్‌కి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. 2019లో జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను రద్దు చేయడంపై మోదీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారని, బీజేపీని విమర్శిస్తూనే వారితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు.
అజయ్ మాకెన్ ఏం చెప్పాడు?
ఆర్టికల్ 370ని రద్దు, జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను రద్దు చేసేందుకు 2019 ఆగస్టు 5న మోదీ ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ఓ ఎంపీతో ఆప్ నేత కాంగ్రెస్‌పై అనవసర ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019లో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను బట్టి చూస్తే.. ఎవరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి ఎవరూ చేరువలో ఉన్నారనేది తెలుస్తోందని అన్నారు. ఆనాటి కేజ్రీవాల్ ట్విట్ ను చూస్తే.. అర్థమవుతుందని అన్నారు.
542 లోక్‌సభలో ఆప్ పార్టీకి కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. అతను కాంగ్రెస్ నుండి కూడా మద్దతు కోరుకుంటున్నాడు. ప్రజలు నాయకుల మంచి,చెడులను చూస్తునే ఉంటారు? మద్దతు అడగడం ఇదేనా? జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇదంతా చేస్తున్నారని, దేశ ప్రజలకు అన్నీ తెలుసన్నారు. అవినీతికి పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందే. ఇదీ న్యాయపాలన. అని సంచలన ట్వీట్ చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఏం ట్వీట్ చేశారు.
5 ఆగస్టు 2019న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. పార్లమెంటులో తీర్మానం చేస్తూ జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ కాశ్మీర్ , లడఖ్‌లను రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన చేసింది. ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ వ్యతిరేక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు , జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిని నెలకొల్పడంలో ప్రభుత్వ ఈ చర్య విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కేజ్రీవాల్ కాంగ్రెస్‌ను హెచ్చరించిన విషయం ఏంటి?
ఢిల్లీలో అధికార యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఆపేందుకు అన్ని ప్రతిపక్షాల మద్దతును కూడగట్టే పనిలో అరవింద్ కేజ్రీవాల్ నిమగ్నమయ్యారు. అయితే.. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించలేదు. మరోవైపు పాట్నాలో విపక్షాల సమావేశానికి ముందు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని, లేదంటే తాను ఉమ్మడి ప్రతిపక్ష సమావేశానికి హాజరు కాబోమని ఆప్ అల్టీమేటం జారీచేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో కూడా తమ నిర్ణయాన్ని స్పష్టం చేయాలని కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చారు. తదుపరి సమావేశాన్ని బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు.
