ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అడ్వర్ టైజ్ మెంట్లపై రూ. 1100లకు పైగా ఖర్చు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆప్ ప్రాధాన్యతలు దీంతో తెలిపిపోయిందని అజయ్ మాకెన్ విమర్శించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు. ఆప్ పాలనలో మూలధన వ్యయం (సీఏపీఈఎక్స్ )12.74 శాతానికి పతనమైందన్నారు.దేశ చరిత్రలో ఇది ప్రథమంగా అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు.దీని ప్రభావంతో ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతినే అవకాశం ఉందని అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. మరో వైపు పేదరికం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.
ఢిల్లీ సీఏపీఈఎక్స్ ఖర్చు 2009-2014 లో రూ. 51, 489.71 కోట్లు ఉండేదన్నారు. కానీ , ఆప్ పాలనలో 2015-20లో కేవలం రూ. 44, 930.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనల వ్యయాన్ని సుప్రీంకోర్టు కూడ ప్రశ్నించిన విషయాన్ని అజయ్ మాకెన్ గుర్తు చేశారు.
మరో వైపు ఆర్ఆర్‌టీఎస్ నిధుల కొరత ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా అజయ్ మాకెన్ ఆప్ సర్కార్ పై విమర్శలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం మూడేళ్లలో ప్రకటనల కోసం రూ. 1,106.02 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం 2020-21 లో 297.70 కోట్లు, 2021-22 లో 596.37 కోట్లు, 2022-23 లో 211.95 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని అజయ్ మాకెన్ ప్రస్తావించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి అడ్వర్ టైజ్ మెంట్ బడ్జెట్ రూ. 557.24 కోట్లుగా అంచనా వేసినట్టుగా అజయ్ మాకెన్ చెప్పారు. దీన్ని పరిశీలిస్తే ఆప్ ప్రాధాన్యతలు ఏమిటనేది తేలుస్తుందన్నారు. గతంలో ఢిల్లీని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మూల ధన వ్యయం ఖర్చుకు సంబంధించిన చార్టులను అజయ్ మాకెన్ ట్వీట్ లో జోడించారు.
