1983లో ఎస్‌ఎల్‌వి-3-డి2 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత శ్రీహరికోటకు హాజరుకావాలని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ మంగళవారం గుర్తుచేసుకుంది. 

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఈ విజయోత్సవ సమయంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు ఉన్నారు. ఈ విజయం తర్వాత ప్రధాని మోడీ స్వయంగా ఇస్రో చీప్ సోమనాదన్ కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఈ మిషన్ లో భాగస్వామ్యులైన ఇతర శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తారు. 

అయినా ప్రధాని తన పర్యటన ముగించుకున్న వెంటనే నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా కలుసుకొని వారిని అభినందించారు. అయితే ఈ పర్యటన ప్రోటోకాల్ వివాదానికి కారణమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తోంది. 1983లో ఎస్‌ఎల్‌వి-3-డి2 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత.. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును శ్రీహరికోటకు ఆహ్వానించిన విషయాన్ని కాంగ్రెస్ మంగళవారం గుర్తుచేసుకుంది.

ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ట్విట్టర్ లో ఇలా పేర్కొన్నారు. పంచుకున్న మరో చరిత్ర మాత్రమే కాదు, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన అవహేళన. చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలను కలవడానికి బెంగళూరు పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో తనను ఆహ్వానించడానికి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌లను ప్రధాని మోదీ అడ్డుకున్నారని రమేష్ ట్వీట్‌లో ఆరోపించారు.

జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. "వారు రాజకీయ ప్రత్యర్థులు, కానీ ఏప్రిల్ 17, 1983 న SLV-3-D2 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత శ్రీహరికోటలో హాజరు కావాలని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ .. ఆ సమయంలో ఏపీ సీఎంగా NT రామారావును ఆహ్వానించారు." అని గత విషయాన్ని గుర్తు చేశారు. 

అయితే.. ప్రధాని మోడీ మాత్రం .. తనను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు రావద్దని కర్ణాటక గవర్నర్‌, ముఖ్యమంత్రి, డిప్యూటీలను అభ్యర్థించినట్లు తెలిపారు . పొద్దున్నే ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు ఇబ్బంది పడటం తనకు ఇష్టం లేదన్నారు.

ఆగస్టు 23న చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలతో సంభాషించేందుకు ప్రధాని శనివారం ఉదయం 6 గంటలకు గ్రీస్ నుంచి బెంగళూరు చేరుకున్నారు 

మరోవైపు.. విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకడంలో ప్రోటోకాల్‌ను విస్మరించారనే ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్‌ అశోక, డీకే శివకుమార్‌ల మధ్య మాటల యుద్దమే జరుగుతోంది.