కర్ణాటక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సిద్ధరామయ్య మరోసారి సీఎం పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేసేందుకు ఆయన అంగీకరించారు. నాలుగు రోజుల మేధోమథనం తర్వాత సీఎం అభ్యర్తి ఖరారు చేసి ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించారు. 

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీని చిత్తుగా ఓడించి 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే.. గెలిచిన తర్వాత తదుపరి సీఎం ఎవరినే ఉత్కంఠ నెలకొంది. సీఎం కూర్చీ కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత ఉత్కంఠకు తెరపడింది. కాబోయే సీఎం అంటూ సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించారు. మే 20న మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ఇదిలా ఉంటే 2024 లోక్ సభ ఎన్నికల ముందు విపక్షాలన్ని ఏకమై ఐక్యతను చాటి చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉన్న పలు లౌకిక పార్టీలను, నేతలను కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అన్ని భావజాల పార్టీలకు ఆహ్మానాలు పంపింది. రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి గెస్టుల జాబితా:

సోనియా గాంధీ

రాహుల్ గాంధీ

ప్రియాంక గాంధీ వాద్రా

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

బీహార్ సీఎం నితీష్ కుమార్

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి నితీశ్ కుమార్ హాజరవుతారని జేడీ(యూ) అధికార ప్రతినిధి రాజీబ్ రంజన్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమితులైన సిద్ధరామయ్య గురువారం స్టాలిన్‌కు ఫోన్‌లో ఫోన్ చేసి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు చెన్నైలో అధికారికంగా విడుదల చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్‌ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా భావసారూప్యత కలిగిన పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.