Congress income: గత సంవత్సరాలతో పోలిస్తే  కాంగ్రెస్ పార్టీ ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. 2019-20లో వివిధ విరాళాల ద్వారా రూ.682.21 కోట్ల ఆదాయం గడించగా.. 2020-21లో ఆ పార్టీ ఆదాయం రూ.285.76 కోట్లకు పడిపోయిందని ఎన్నికల సంఘానికి ఇచ్చిన వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అలాగే.. ఖ‌ర్చులను కూడా చాలా త‌గ్గించిన‌ట్టు పేర్కొంది 

Congress income: రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తుంటాయి. ఇందులో భాగంగానే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ గడిచిన ఆర్ధిక సంవత్సరం 2019-20 ఆదాయ, వ్య‌య వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ కు స‌మ‌ర్పించింది. ఈ నివేదిక‌ల ప్ర‌కారం.. గత సంవత్సరాలతో పోలిస్తే 2020-2021లో భారత జాతీయ కాంగ్రెస్ ఆదాయం గ‌ణ‌నీయంగా తగ్గుతూనే ఉంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ కు స‌మ‌ర్పించిన వార్షిక ఆదాయ వ్యయాల నివేదిక ప్ర‌కారం.. 2019-20లో కాంగ్రెస్ పార్టీ విరాళాలు, ఇతర ఆదాయం ( Congress income )ద్వారా రూ.682.21 కోట్ల ఆదాయం ఆర్జించగా.. 2020-21లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం రూ.285.76 కోట్లకు పడిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అలాగే.. ఖ‌ర్చులను (expenditure) కూడా చాలా త‌గ్గించిన‌ట్టు పేర్కొంది. 2019-20లో రూ.998 కోట్లు ఖర్చు చేయగా.. 2020-21లో రూ.209 కోట్లకు తగ్గిందని పేర్కొంది.

అలాగే.. 2020-21లో ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతుదారుల నుంచి కాంగ్రెస్ ఎలాంటి విరాళాలు స్వీకరించలేదని తెలిపింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) రూపంలో రూ.10.07 కోట్లు, కంపెనీల నుంచి రూ.24.46 కోట్ల విరాళాలు, ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.7.36 కోట్లు అందినట్లు పేర్కొంది.

అలాగే.. 2019-20లో పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి రూ.29.67 లక్షలు, సానుభూతిపరుల నుంచి రూ.52,000, ఎలక్టోరల్ బాండ్ల రూపం ( electoral bonds) లో రూ.317.86 కోట్లు వచ్చాయి. ఎన్నికల సంవత్సరంలో కంపెనీ దాతల నుంచి రూ.94.02 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ. కోటి రూపాయలు అందాయ‌ని పేర్కొంది. ఇక‌.. 2019-20 మ‌ధ్య జ‌రిగిన‌ ఎన్నికల ఖర్చు కోసం రూ.864 కోట్లు ఖర్చు చేయగా, 2020-21 మ‌ధ్య జ‌రిగిన‌ ఎన్నికల కోసం రూ.91.35 కోట్లు ఖర్చు (expenditure) చేసిన‌ట్టు కాంగ్రెస్ పేర్కొంది.

మరోవైపు ప్రోగ్రెస్‌లో ఉన్న హెడ్ క్యాపిటల్ వర్క్స్ (CWIP) కింద 2019-20లో రూ. 169 కోట్లు, 2020-21లో రూ.207.95 కోట్లు ఖర్చు చేసిన‌ట్టు తెలిపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూలో నిర్మిస్తున్న కొత్త పార్టీ కార్యాలయం కోసం ఈ మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), జనతాదళ్-యునైటెడ్ (JD-U) వార్షిక నివేదికలను కూడా EC వెల్ల‌డించింది. 2019-2020లో NCP ₹85.58 కోట్లు ఆర్జించగా.. 2020-2021లో NCP ₹34.92 కోట్లకు త‌గ్గింది. అలాగే.. పార్టీ ఖర్చుల‌ వివరాలను ప‌రిశీలిస్తే.. 2019-2020లో ₹109.18 కోట్లను ఖ‌ర్చు (expenditure ) చేయ‌గా.. 2020-2021లో ₹12.17 కోట్లకు తగ్గింది.

JD(U) income

JD(U) తన ఆదాయం 2019-2020లో ₹23.25 కోట్లు ఉండ‌గా.. 2020-2021లో ₹65.31 కోట్లకు పెరిగింది. ఈ పార్టీ ఖర్చులు కూడా ₹10.67 కోట్ల నుంచి ₹24.34 కోట్లకు పెరిగిన‌ట్టు ప్ర‌క‌టించింది. భారతీయ జనతా పార్టీ (BJP) 2020-2021 వార్షిక నివేదికను EC ఇప్పటివరకు ప్రచురించలేదు. 2019-2020 వివరాల ప్ర‌కారం.. బీజేపీ ఆదాయం రూ.3,623.28 కోట్లు కాగా.. ఖ‌ర్చు రూ. ₹1,651.02 కోట్లు చేసిన‌ట్టు బీజేపీ నివేదించింది.