Congress political panel : 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధ‌మ‌వ‌డానికి ముందు కాంగ్రెస్ పార్టీ మూడు గ్రూపులుగా ఏర్పడి.. ముందుకు సాగే ప్రాణాళిక‌లు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ ను ప్ర‌క‌టించింది. ఇందులో ప్రశాంత్ కిషోర్ మాజీ అసోసియేట్ తో పాటు ఇద్ద‌రు కాంగ్రెస్ రెబెల్స్ కూడా ఉన్నారు.  

Congress Task Force 2024: దేశంలో కాంగ్రెస్ పార్టీకి గ‌త వైభ‌వాన్ని తీసుకురావ‌డంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైన విజ‌యం సాధించి.. అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దాని కోసం ఇప్ప‌టికే నుంచే ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధ‌మ‌వ‌డానికి ముందు కాంగ్రెస్ పార్టీ మూడు గ్రూపులుగా ఏర్పడి.. ముందుకు సాగే ప్రాణాళిక‌లు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ ను ప్ర‌క‌టించింది. ఇందులో ప్రశాంత్ కిషోర్ మాజీ అసోసియేట్ తో పాటు ఇద్ద‌రు కాంగ్రెస్ రెబెల్స్ కూడా ఉన్నారు. 

పార్టీలో ప్రక్షాళన, 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌ను నిర్వహించింది. ఈ మూడు రోజుల సదస్సులో వ్యవస్థాగత విషయాలతోపాటు, దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతపై చర్చ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 60 నుంచి 70 మంది చ‌ర్చించారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. మిషన్ 2024 పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శిబిరం ద్వారా శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని భావించారు. అయితే, చింత‌న్ శిబిర్ చ‌ప్ప‌గా సాగింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని, టాస్క్‌ఫోర్స్ 2024 ను కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ 2024 రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌కంగా ప‌నిచేయ‌నుంది. సోనియా గాంధీ ప్ర‌క‌టించిన ఈ కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ లో కాంగ్రెస్ రెబ‌ల్ లీడ‌ర్స్ తో పాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మాజీ సహచ‌రుడుకి కూడా ఇందులో చోటుక‌ల్పించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎనిమిది మంది సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల బృందాన్ని, టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు కోరిన G-23 గ్రూప్ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. పార్టీ తన భారత్ జోడో యాత్ర కోసం కేంద్ర ప్రణాళికా బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాజకీయ వ్యవహారాల గ్రూపు సభ్యులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, కెసి వేణుగోపాల్, జితేంద్ర సింగ్, జీ-23 నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు ఉన్నారు. 

టాస్క్‌ఫోర్స్‌లో మాజీ కేంద్ర మంత్రి పీ.చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ, రణదీప్ సూర్జేవాలా, సునీల్ కానుగోలు కూడా ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని ప్రతి సభ్యునికి ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, మీడియా, ఔట్‌రీచ్, ఫైనాన్స్ మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్దిష్ట టాస్క్ కేటాయించబడుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపార‌యి. వారు నియమించబడిన బృందాలను కలిగి ఉంటారు. ఉదయపూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్ మరియు ఆరు గ్రూపుల నివేదికలను కూడా టాస్క్ ఫోర్స్ అనుసరిస్తుంది. భారత్ జోడో యాత్ర సమన్వయం కోసం కేంద్ర ప్రణాళికా బృందంలో దిగ్విజయ సింగ్, సచిన్ పైలట్, శశి థరూర్, రవ్‌నీత్ సింగ్ బిట్టు, కేజే జార్జ్, జోతిమణి, ప్రద్యుత్ బోర్డోలోయ్, జితు పట్వారీ మరియు సలీమ్ అహ్మద్‌లతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.