Asianet News TeluguAsianet News Telugu

అడ్డంగా బుక్కైన దిగ్విజయ్ సింగ్.. నెటిజన్ల ట్రోల్స్

దిగ్విజయ్‌ ట్వీట్‌ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్‌ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్‌ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు.

Congress' Digvijay Singh trolled for tweeting 'fake' picture attacking UP CM Yogi Adityanath
Author
Hyderabad, First Published Oct 5, 2018, 11:12 AM IST

బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలనే అత్యుత్సాహంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్... అడ్డంగా బుక్కయ్యారు. ఇంకేముంది ఛాన్స్ దొరికే సరికి నెటిజన్లు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  ఇంతకీ మ్యాటరేంటంటే.. ఏ రాజకీయ నాయకుడైనా.. తమ ప్రత్యర్థి పార్టీ నేతలు ఏ తప్పు చేస్తారా..? ఎత్తి చూపుదామని చూస్తుంటారు. అలాంటి అవకాశం దొరికితే.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటారు. ఇదే దిగ్విజయ్ సింగ్ కూడా చేశారు. కానీ కాస్త బెడిసి కొట్టింది.


దిగ్విజయ్‌ సింగ్‌ తన ట్విటర్‌లో నిరుపయోగంగా పడి ఉండి శిథిలావస్థకు చేరుకున్న 108 వాహనాల ఫోటోను షేర్‌ చేశారు. ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్‌కు ఏం చేశారు..? అఖిలేశ్‌ యాదవ్‌ హాయాంలో ప్రారంభించిన 108, 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అంటూ ట్వీట్‌ చేశారు.

కానీ అసలు విషయం ఏంటంటే ఈ అంబులెన్స్‌లు ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవి. తొలుత రజత్‌ యాదవ్‌ అనే వ్యక్తి షేర్‌ చేసిన ఈ ఫోటోను కాస్తా దిగ్విజయ్‌ సింగ్‌ కాపీ చేసి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని ఆయనే నవ్వుల పాలయ్యారు. దిగ్విజయ్‌ ట్వీట్‌ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్‌ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్‌ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు.

 

గతంలో కూడా దిగ్విజయ్‌ సింగ్‌ పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ‘భోపాల్‌ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆనక అది కాస్తా పాకిస్తాన్‌కు చెందిన మెట్రో పిల్లర్‌గా తెలడంతో తన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios