మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళ్లనుందని ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ ముందు అనేక సవాళ్లున్నాయన్నారు.
న్యూఢిల్లీ:మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ చెప్పారు.బుధవారం నాడు ఎఐసీసీ చీఫ్ గా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. న్యూఢిల్లీలోని ఎఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గేకు సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించారు . ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లున్నాయన్నారు. ఖర్గే నాయకత్వంలో ఈ సవాళ్లను అధిగమిస్తూ పార్టీ ముందుకు వెళ్లనుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేను అభినందించారు సోనియాగాంధీ,.ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా ఆమె చెప్పారు.సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా మల్లికార్జున ఖర్గే ఎదిగారని ఆమె గుర్తు చేశారు.ఖర్గేకు తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ఖర్గేకు బాధ్యతలు అప్పగించడంతో తాను ఉపశమనం పొందినట్టుగా ఆమె తెలిపారు.గతంలో పార్టీ అనే క సంక్షోభాలను చూసిందన్నారు. కానీ ఏనాడూ కూడ ఓమటమిని చూడలేదన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల అంకితభావంతో ఖర్గే పనిచేస్తారని సోనియాగాంధీ ఖర్గేను పొగడ్తలతో ముంచెత్తారు.పార్టీ అప్పగించిన ప్రతి పనిని ఖర్గే అంకితభావంతో పూర్తి చేశారని ఆమె గుర్తు చేశారు.
also read:ఎఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ:హాజరైన సోనియా,రాహుల్
తన చివరి శ్వాస వరకు తనపై చూపిన ప్రేమ, గౌరవాన్ని గుర్తు పెట్టుకుంటానని చెప్పారు. అయితే ఈ గౌరవాన్ని, ప్రేమను గుర్తిస్తానన్నారు. ఎఐసీసీ చీఫ్ పదవి అనేది చాలా పెద్ద బాధ్యతగా ఆమె పేర్కొన్నారు.ఈ బాధ్యతల నుండ తాను ఇవాళ తప్పుకోవడం తనకు సహజంగా ఉపశమనం పొందినట్టుగా ఉందన్నారు.
