Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుంచి రాహుల్ ‘‘భారత్ జోడో యాత్ర’’.. కన్యాకుమారి వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు

రేపటి నుంచి జరగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు , శ్రేణులు కన్యాకుమారి వద్దకు చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హస్తం నేతలు అక్కడికి బయల్దేరారు. 
 

congress cadre reached to kanyakumari for rahul gandhi's bharat jodo yatra
Author
First Published Sep 6, 2022, 7:22 PM IST

భారత్ జోడో యాత్ర కోసం దేశవ్యాప్తంగా వున్న కాంగ్రెస్ శ్రేణులు కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్దకు చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నేతలు కూడా రాహుల్ పాదయాత్ర కోసం అక్కడికి చేరుకుంటున్నారు. అరేబియా సముద్రం , బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే సంగమం వద్ద రాహుల్ గాంధీ ఐక్యతా పాదయాత్ర ప్రారంభించనున్నారు. 

ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ గ‌త వైభ‌వాన్ని తిరిగి తీసుకురావ‌డానికి ఉన్న అన్ని ప్ర‌య‌త్నాల‌ను చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా రానున్న లోస్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవడానికి ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికలు ర‌చిస్తూ.. ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్త యాత్ర‌కు సిద్ధ‌మైంది. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు రాహుల్ గాంధీ యాత్ర‌ను చేప‌డుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమవుతుంది. ఇది 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 150 రోజులలో 3,500 కిలో మీట‌ర్లు కొన‌సాగ‌నుంది. ఇతర రాష్ట్రాలు కూడా భారత్ జోడో యాత్ర, సంబంధిత కార్యక్రమాలను ఈ కార్యక్రమం కింద జ‌ర‌గ‌నున్నాయి.

ALso REad:రాహుల్ ఫోటో వైరల్.. కొంద‌రి ప్ర‌శంసలు.. మ‌రికొంద‌రి విమ‌ర్శ‌లు.. ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముందంటే..?

ఇకపోతే.. రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 24 న  కర్ణాటకలోని రాయిచూర్ నియోజకవర్గం నుండి తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర రానుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం లో రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుందని రేవంత్ రెడ్డి చెప్పారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపల్లి, మద్నూర్ మీదుగా నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర వెళ్లనుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

5 రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన తర్వాత  మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుందని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో 350 కి.మీ సాగుతుందని రాష్ట్ర ప్రజలు వందలాది మందిగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రతి రోజూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాహుల్ గాంధీ వెంట ఉంటారని రేవంత్ రెడ్డి వివరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios