Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ ఫోటో వైరల్.. కొంద‌రి ప్ర‌శంసలు.. మ‌రికొంద‌రి విమ‌ర్శ‌లు.. ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముందంటే..?

కాంగ్రెస్ పార్టీ  సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతోంది. ఈ  ఫోటోను చూసిన వారిలో కొంద‌రూ ఆయ‌న‌ను ప్రశంసిస్తుంటే.. మ‌రికొంద‌రూ ఆయ‌న‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముంద‌ని అనుకుంటున్నారా..? 
 

Rahul Gandhi helping co-passenger on a flight, Congress leader shares photo
Author
First Published Sep 6, 2022, 6:04 PM IST

సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ‌ వైరల్ అవుతోంది.  రాహుల్ గాంధీ సాధారణంగానే  సెల‌బ్రెటి, ఆయ‌నో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షపార్టీ మాజీ అధినేత.. ఆయ‌న ఫోటోలు కామ‌న్ గానే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉంటాయి. ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలిచేంత ప్ర‌త్యేకత ఈ ఫోటో  ఏముందని అనుకుంటున్నారా? అయితే.. ఓ సారి ఈ వార్త చ‌ద‌వాల్సిందే..

ఈ ఫోటోలో రాహుల్ గాంధీ ఓ సాధార‌ణ వ్య‌క్తిలాగా ఫ్లైట్‌లో ప్ర‌యాణిస్తూ.. తోటి మ‌హిళ‌ ప్ర‌యాణికురాలికి స‌హాయం చేస్తుంట‌డం చూడ‌వ‌చ్చు. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నేత అమన్ దూబే ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో సోమవారం రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తీసినది అని అమన్ దూబే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విమానంలో ప్ర‌యాణిస్తున్న సమయంలో.. ఓ మహిళా ప్రయాణీకురాలు త‌న  ల‌గేజీని పైన పెట్టాడానికి ప‌డుతుంటే..  రాహుల్ గాంధీ స్వయంగా ఆమెకు సహాయం చేశాడు. 

రాహుల్ గాంధీ స‌హాయం చేస్తున్న‌ చిత్రాన్ని పంచుకుంటూ.. అమన్ దూబే ఇలా వ్రాశాడు, "యాదృచ్ఛికంగా నేను అహ్మదాబాద్‌కు వెళ్తున్న విమానంలో రాహుల్ గాంధీ కూడా ప్ర‌యాణిస్తున్నారు.  ఆయ‌న ఓ మహిళా ప్రయాణికురాలు త‌న సామాను పైన పెట్ట‌డంలో ఇబ్బంది పడటం చూసి.. ఆయ‌న  స్వయంగా ఆమెకు సహాయం చేసారు. అనంతరం వెళ్లి రాహుల్‌ను కలిశారు. అతని సాధారణ జీవితం మాకు స్ఫూర్తినిస్తుంది. అని పేర్కొన్నారు.
 
ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ సాధార‌ణ జీవితం అంద‌రికీ  ఆద‌ర్శ‌ప్రాయమ‌ని కొంతమంది ఆయ‌న‌ను ప్రశంసిస్తుంటే.. విమానంలో ఎయిర్‌హోస్ట్‌లు ఉన్నప్పుడు.. రాహుల్ గాంధీ మహిళ తన లగేజీని ఉంచడానికి ఎందుకు సహాయం చేశాడని కామెంట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే.. రాహుల్ గాంధీ ఎందుకు మాస్క్ ధరించలేదని కొందరు  విమ‌ర్శిస్తున్నారు. 

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర నేప‌థ్యంలో ఆయ‌న  సోమవారం అహ్మదాబాద్‌కు వెళ్లార‌ని తెలుస్తుంది. భారత జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొన‌సాగనుంది

భారత్ జోడో

కాంగ్రెస్ ప్రతిపాదిత ప్ర‌చార యాత్ర‌ భారత్ జోడో. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై.. నవంబర్ 25న  మధ్యప్రదేశ్‌లోని మాల్వా-నిమార్ ప్రాంతంలో ముగ‌య‌నున్న‌ది. ఈ యాత్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కొన‌సాగ‌నున్న‌ది. ఈ యాత్ర‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో ఇత‌ర పార్టీ నాయకుల‌ను, ప్రజలను ఆయ‌న క‌లువ‌నున్నారు.

ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా దాదాపు 3,500 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో పాల్గొనే ప్రజలు ప్రతిరోజూ దాదాపు 25 కి.మీల దూరం యాత్ర చేస్తారని, రాహుల్ గాంధీ మార్గమధ్యంలో ప్రజలతో మమేకమవుతుంటారు.మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా గాంధీ ఉజ్జయినిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారని, దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారని తెలుస్తుంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios