ప్రతిపక్షాల ఇండియా కూటమిలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ భగ్గుమంది. కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక ఇండియా కూటమికి అర్ధం లేదని మండిపడింది.
ప్రతిపక్షాల ఇండియా కూటమిలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. కూటమిలో ప్రాన పార్టీ అయిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో కూటమిలో చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది. అలాంటప్పుడు పొత్తు ఎందుకని ప్రశ్నించింది. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది.
దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించినట్లు ఆ పార్టీ నేత అల్కా లాంబా తెలిపారు. అంతేకాదు.. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక ఇండియా కూటమికి అర్ధం లేదని మండిపడింది.
