మసీదులో మువ్వన్నెల జెండాకు అవమానం..  జాతీయ జెండా సాక్షిగా ఇరువర్గాల మధ్య ఘర్షణ..

జెండాను ఎవరు ఎగురవేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల వాగ్వాదం జరిగింది. ఆ వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ముష్టిఘాతాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన కేరళలోని మసీద్ లో చేటుచేసుకుంది. 

conflict in Jamaat mosque in Kasaragod Eruthumkadavu over the independence day KRJ

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి భారతీయుడు తన దేశ భక్తిని చాటుకున్నాడు. మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేశాడు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకున్నాడు. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల చేటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి  ఘర్షణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. కేరళలోని  కాసర్‌గోడ్‌ ఎరుతుంకడవులోని జమాత్ మసీదులో మసీదులోని పెద్దలు, సభ్యులకు మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వారు రెండు వర్గాలుగా చీలిపోయారు.  గత నాలుగు నెలలుగా మసీదు కమిటీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం సాగుతోంది.అయితే చర్చల అనంతరం ఇరు పక్షాలు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే ఏకంగా జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. ఆగష్టు 15న మసీదులో జెండాను ఎగురవేయడానికి ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ.. అనుకున్నది .. అక్కడ జరిగింది వేరే.  జెండా ఎగురవేసే విషయంలో మళ్లీ భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇరువర్గాలు కలిసి జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యానగర్ పోలీసులు విచారణ చేపట్టారు.

దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగవారం నాడు ఘనంగా జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి.. 10వ సారి ప్రసంగించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 76 ఏళ్లలో భారతదేశం సాధించిన విజయాలను ఎత్తిచూపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తమ దేశానికి ఉన్న స్థానం గురించి ప్రతి భారతీయుడు గర్వపడాలని ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో సైన్స్, సమాజం మరియు ఆర్థిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios