కరోనా ఉద్ధృతి.. ఆ రెండు రాష్ట్రాల్లో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం (tamilnadu govt) ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం (tamilnadu govt) ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. బస్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల వద్దకు వెళ్లే ఆటోలు, ట్యాక్సీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. గురువారం తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదవ్వగా... 39 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాన కేసుల సంఖ్య 30 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 37 వేలకు పైనే ఉంది. ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మందికి ప్రికాషనరీ డోసు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
అటు థర్డ్ వేవ్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రం (kerala) సైతం వచ్చే రెండు ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించుకుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. జనవరి 23, జనవరి 30 తేదీల్లో ఈ లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గురువారం కేరళలో 46 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. మరోవైపు కర్ణాటక (karnataka) మాత్రం ఆంక్షలను కాస్త సడలించింది. వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసింది. అయితే రాత్రి ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. మాల్స్, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు 50 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
కాగా.. ఢిల్లీలో (delhi) కోవిడ్ -19 (covid -19) నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూను (weekend curfew) నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కోరారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆయన సిఫార్సులు పంపించారు. రాష్ట్రంలో కోవిడ్ -19 పీక్ స్టేజ్ కు చేరుకుందని, క్రమంగా బలహీనపడుతోందని గురువారం హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ (satyendar jain) తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన ఒక రోజు తరువాత వీకెండ్ కర్ఫ్యూ ఆంక్షలు ఎత్తివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న సరి - బేసి విధానాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అలాగే ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించాలని కోరారు. ఈ సిఫార్సులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపితే ఇకపై ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఉండదు. అలాగే ప్రస్తుతం ప్రైవేటు ఆఫీసులు కొనసాగిస్తున్న వర్క్ ఫ్రం హోం పద్దతిలో కొంత వెసులుబాటు వస్తుంది. మార్కెట్ లు కూడా పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంటుంది.
ఈ థర్డ్ వేవ్ (third wave) ప్రారంభమైన మొదట్లో దేశవ్యాప్తంగా ఢిల్లీలోనే అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్రలో అధికంగా కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈ సమయంలో ఢిల్లీలో లాక్ డౌన్ (lock down) విధిస్తారని అందరూ భావించారు. కానీ దీనిపై గత వారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే ఎందరో మంది శ్రామిక ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయని చెప్పారు. మరెందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటారని, ఉపాధి కోల్పొతారని చెప్పారు. కాబట్టి ఎప్పుటికీ లాక్ డౌన్ విధించబోమని అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే లాక్ డౌన్ విధిస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను ఒక్కోటిగా మెళ్లగా ఎత్తేస్తున్నారు. కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోతే ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.