కరోనా కేసుల విజృంభణను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం మే 10 నుంచి రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులో నమోదవ్వడంతో ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. 

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం ఆయన తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది.

తమిళనాడులో శుక్రవారం కొత్తగా 26,465 కేసులు నమోదవడంతో ఇప్పటివరకు ఉన్న కేసుల సంఖ్య 13,23,965 కు పెరిగింది. కరోనా మరణాలు 197గా నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,171 కు చేరుకుంది.

చెన్నైలో 6,738 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రోజు వరకు మొత్తం నమోదైన కేసులు 3,77,042గా ఉన్నాయి. ఇక మొత్తం మరణాల సంఖ్య 5,081.

లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.