లక్నో:బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపై చోటు చేసుకొన్న హృదయ విదారకరమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఓ న్యాయవాది. 

బీహార్  రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ పారంపైనే మహిళా వలస కూలీ మరణించింది. ఆమె మరణించిన విషయం తెలియక కొడుకు ఆమెను లేపేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ రాష్ట్రం నుండి తన స్వంత రాష్ట్రం బీహార్ కు వచ్చే సమయంలో తగిన భోజనం, ఆహారం సమకూర్చని కారణంగా ఆమె మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.  ఇదే విషయమై లాయర్ మహమూద్ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు.

also read:తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలియక, తల్లిని లేపుతూ చిన్నారి: వీడియో వైరల్

మే 25వ తేదీన రైల్వేస్టేషన్ లో రికార్డైన సీసీ పుటేజీని సీజ్ చేయాలని కోరారు. బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖలపై  తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా సదరు మహిళ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు. 

బీహార్‌ రైల్వే కనీస వసతులు కూడా రైళ్లో కల్పించలేదని, శిశు, మహిళ సంరక్షణ విషయంలో విఫలమైందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.