బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటన వెనక ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. వివరాలు.. బాధిత విద్యార్థి శశాంక్ ఆర్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శశాంక్ మైసూరుకు చెందిన దూరపు బంధువైన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమను ఇరువైపుల తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
అయితే జూలై 3న బెంగళూరుకు వచ్చిన యువతిని శశాంక్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు ఇంట్లోకి దూసుకెళ్లి శశాంక్‌పై దాడి చేశారు. యువతిని వారి వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. శనివారం శశాంక్‌ను అతని తండ్రి రంగనాథ్ కాలేజ్ వద్ద దింపేశాడు. ఆ రోజు కాలేజీ ముగించుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్న శశాంక్‌ను దుండగుల ముఠా కిడ్నాప్ చేసింది. కిడ్నాపర్లు అతని చేతులు, కాళ్ళు కట్టివేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే తీవ్ర గాయాలతో బయటపడ్డ శశాంక్ ప్రజల సహాయంతో అతని కుటుంబాన్ని సంప్రదించాడు.
పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యువతి బంధువులే ఈ పని చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, శశాంక్ విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
